ఎంటర్టైన్మెంట్ వార్తలు

గన్నవరం విమానాశ్రయంలో జగన్ తో సినీ నటుడు బ్రహ్మానందం…

  • గన్నవరం విమానాశ్రయంలో ఒకరికొకరు తారసపడ్డ జగన్, బ్రహ్మానందం
  • ఇద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్న వైనం
  • గన్నవరం నుంచి బెంగళూరుకు వెళ్లిపోయిన జగన్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం కలిశారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో ఈ అరుదైన కలయిక చోటు చేసుకుంది. బెంగళూరుకు వెళ్లేందుకు జగన్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి ఒక పని మీద గన్నవరం చేరుకున్న బ్రహ్మానందం ఎయిర్ పోర్టులోనే ఉన్నారు. ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. బ్రహ్మానందం యోగక్షేమాలు, ఆరోగ్యం గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు. వీరి కలయికకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Related posts

16 రోజుల దేవర వసూళ్లను అధికారికంగా ప్రకటించిన మేకర్స్‌!

Ram Narayana

నా వక్షోజాలు నిజమైనవే: లై డిటెక్టర్ టెస్టులో రూమర్స్‌కు చెక్ పెట్టిన హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీ

Ram Narayana

దర్శకుడు అనిల్ రాయపూడికి మెగాస్టార్ మేఘా గిఫ్ట్…

Ram Narayana