జాతీయ వార్తలు

లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్ జి

  • లొంగిపోయిన మావోయిస్టు నాయకులు దేవ్ జీ, మల్లారెడ్డి
  • తెలంగాణ ఎస్ఐబీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు
  • వీరితో పాటు 16 మంది లొంగుబాటు

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’లో కీలక పరిణామం చోటు చేసుకున్నది. మావోయిస్టు కీలక నేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి భద్రతా బలగాలకు సరెండర్ అయ్యారు. దేవ్ జీ మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉండగా, రాజిరెడ్డి పొలిట్ బ్యూరో మెంబర్‌గా ఉన్నారు. రెండు రోజుల్లో వారిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

వీరితో పాటు మరో 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దేవ్‌జీ అలియాస్ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాకు చెందినవాడు. వీరంతా తెలంగాణ ఎస్ఐబీ ఎదుట సరెండర్ అయ్యారు. నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ తర్వాత సెక్రటరీగా దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి మావోయిస్టు పార్టీకి సారథ్యం వహిస్తున్నారు.

Related posts

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్…

Ram Narayana

చక్రం తిప్పిన చంద్రబాబు …అశోక గజపతిరాజుకు గోవా గవర్నర్ పదవి

Ram Narayana

తెలంగాణ అభివృద్ధి సాధ్యమైనపుడు మహారాష్ట్రలో ఎందుకు కాదు?: కేసీఆర్

Drukpadam