అంతర్జాతీయం

ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ ఎయిర్ స్ట్రైక్స్ లో హతమయ్యాడా?

  • రెండు రోజుల క్రితం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి
  • తాత్కాలిక సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన అలీ రెజా అరాఫీ
  • అరాఫీ కూడా మృతి చెందినట్లు కథనాలు
  • ధృవీకరించని ఇరాన్ అధికార వర్గాలు

అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడిలో ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ అలీ రెజా అరాఫీ కూడా మరణించినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైన విషయం తెలిసిందే. దీనితో అలీ రెజా అరాఫీ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన గంటల్లోనే ఆయన కూడా ఈ వైమానిక దాడుల్లో మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ మృతిని ఇరాన్ అధికార వర్గాలు ధృవీకరించవలసి ఉంది. ఖమేనీ హత్యను మొదట ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత ఇరాన్ అధికారులు ధృవీకరించారు. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ లక్ష్యంగా ఇరాన్ దాడులు నిర్వహిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయంపై వైమానిక దాడులు చేస్తోంది.

Related posts

బంగ్లాదేశ్‌లో హిందువులపై పెరుగుతున్న దాడులు… చెప్పాపెట్టకుండా వచ్చేసిన ఎన్టీపీసీ ఇంజినీర్లు..

Ram Narayana

అమెరికా ఆలా …భారత్ ఇలా …రష్యా నుంచి చమురు దిగుమతిపై …

Ram Narayana

చెల్లికి ప్రమోషన్.. కూతురుకు వారసత్వం?: కిమ్ కుటుంబంలో కీలక పరిణామాలు…

Ram Narayana