జనరల్ వార్తలు ...

గల్ఫ్‌లో ఇరాన్ పంజా: అమెరికా నౌకపై క్షిపణి దాడి.. ఒకరి మృతి!

 గల్ఫ్‌లో ఇరాన్ పంజా: అమెరికా నౌకపై క్షిపణి దాడి.. ఒకరి మృతి!

Iran attacks US ship in Gulf one dead
  • అమెరికా నౌక సహా రెండు నౌకలపై ఇరాన్ దాడి
  • క్షిపణి దాడిలో ఒక నావికుడి మృతి.. పలువురికి గాయాలు
  • గల్ఫ్ ప్రాంతంలో టెన్షన్.. అప్రమత్తమైన అగ్రరాజ్యం
  • కీలకమైన సముద్ర మార్గంలో నౌకల రాకపోకలకు అంతరాయం
  • డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతున్న ఇరాన్ దళాలు

గల్ఫ్ జలాల్లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఇరాన్ దళాలు జరిపిన భీకర దాడుల్లో అమెరికా యాజమాన్యంలోని ఒక వాణిజ్య నౌకతో పాటు మరో నౌక కూడా తీవ్రంగా దెబ్బతింది. క్షిపణులు నేరుగా నౌకను తాకడంతో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో గల్ఫ్ రీజియన్‌లో యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇరాన్ తన అత్యాధునిక డ్రోన్లు, క్షిపణులను ఈ దాడుల్లో ప్రయోగించినట్లు తెలుస్తోంది. సముద్ర మార్గం ద్వారా జరిగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా నౌకపై దాడి జరగడం అగ్రరాజ్యానికి నేరుగా సవాల్ విసిరినట్లయింది.

ఈ దాడుల నేపథ్యంలో గల్ఫ్ ఆఫ్ ఒమన్, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో నౌకల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. భద్రతా కారణాల దృష్ట్యా పలు నౌకలు తమ మార్గాలను మార్చుకుంటున్నాయి. అమెరికా తన నౌకాదళాన్ని మరింత అప్రమత్తం చేయడంతో పశ్చిమాసియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని యుద్ధ వాతావరణం నెలకొంది.

తగ్గని ట్రంప్ బెదిరింపులు …

మేం తలచుకుంటే ఇరాన్‌ను అంధకారంలోకి నెట్టడం గంట పని: ట్రంప్

Trump says Iran blackout possible in one hour
  • గంటలోనే ఇరాన్ విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేయగలమని ట్రంప్ హెచ్చరిక
  • కాలిఫోర్నియా తీరంలో డ్రోన్ దాడికి ఇరాన్ కుట్ర పన్నుతోందని ఆరోపణ
  • ఇరాన్ నౌక, వాయుసేనలను ఇప్పటికే నిర్వీర్యం చేశామని వ్యాఖ్య
  • ఇంధన ధరల స్థిరీకరణకు త్వరలో చమురు నిల్వల విడుదల
  • అమెరికాలో ఇరాన్ స్లీపర్ సెల్స్ ఉన్నాయని ఆరోపణ

ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తలచుకుంటే కేవలం గంట వ్యవధిలోనే ఇరాన్ విద్యుత్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేయగలమని తీవ్రంగా హెచ్చరించారు. అదే సమయంలో, కాలిఫోర్నియా తీరంలో ఒక పడవ నుంచి డ్రోన్‌లతో దాడి చేసేందుకు ఇరాన్ పన్నుతున్న కుట్రపై తమ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ఆయన వెల్లడించారు.

కెంటకీ, ఒహియో పర్యటనల అనంతరం జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ ఇరాన్‌తో యుద్ధంపై కీలక విషయాలు పంచుకున్నారు. “మేం తలచుకుంటే గంటలో వారి విద్యుత్ సామర్థ్యాన్ని కూల్చివేయగలం. దాన్ని మళ్లీ నిర్మించుకోవడానికి వారికి 25 ఏళ్లు పడుతుంది. కానీ మేం అలా చేయాలనుకోవడం లేదు” అని అన్నారు. ఇరాన్ సైనిక శక్తిని ఇప్పటికే తాము నిర్వీర్యం చేశామని, వారి నౌకాదళం, వాయుసేనలను తుడిచిపెట్టేశామని చెప్పారు.

అమెరికా చేపడుతున్న సైనిక చర్యకు ఇతర శక్తిమంతమైన దేశాల నుంచి ప్రైవేట్‌గా మద్దతు లభిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. తమ సైనిక చర్యల ఫలితంగా ఇరాన్ తీవ్రంగా నష్టపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలోని సరిహద్దు విధానాల వల్ల ఇరాన్‌కు చెందిన స్లీపర్ సెల్స్ అమెరికాలోకి ప్రవేశించాయని ట్రంప్ ఆరోపించారు. “చాలా మంది బైడెన్ తెలివి తక్కువ ఓపెన్ బార్డర్ విధానం ద్వారా లోపలికి వచ్చారు. వారిలో చాలామంది ఎక్కడున్నారో మాకు తెలుసు, వారిపై ఓ కన్నేసి ఉంచాం” అని తెలిపారు.

యుద్ధం వల్ల ఇంధన మార్కెట్లపై ప్రభావం పడకుండా, వ్యూహాత్మక నిల్వల నుంచి చమురును విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ట్రంప్ వివరించారు. ఈ ప్రక్రియను చాలా వేగంగా ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Related posts

Microsoft Office 365 now has 120 million business users

Ram Narayana

ఏఐ బాట్ ల మధ్య షాకింగ్ సంభాషణ.. ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తం చేస్తున్న నెటిజన్లు!

Ram Narayana

రాత్రి కురిసిన భారీ వర్షానికి మునిగిన నాగ్‌పూర్.. రంగంలోకి కేంద్ర బలగాలు

Ram Narayana