జనరల్ వార్తలు ...

మొబైల్ వ్యసనం నుంచి బయటపడాలి ..అందుకు పెద్దలు ఆదర్శంగా ఉండాలి ..

మొబైల్ వ్యసనం: నేటి కాలంలో పిల్లలు సరిగ్గా చదవకపోవడం, ఎప్పుడూ చేతిలో మొబైల్ పట్టుకుని ఉండటం అనేది ప్రతి తల్లిదండ్రుల ఆవేదన. అయితే, ఇది కేవలం మాటలతో సరిదిద్దే విషయం కాదు. దీని వెనుక లోతైన మెదడు పని తీరు దాగి ఉంది.

తల్లిదండ్రులే మొదటి రోల్ మోడల్స్:- పిల్లలు మీరు చెప్పే మాటల కంటే, మీరు చేసే పనులనే ఎక్కువగా గమనిస్తారు. మీరు రోజంతా మొబైల్‌లో ఉంటూ పిల్లలను చదువుకోమంటే అది సాధ్యం కాదు.

​పరిష్కారం: ఇంట్లో కనీసం రాత్రిపూట ఒక గంటను “నో గ్యాడ్జెట్ అవర్” గా ప్రకటించండి. ఆ సమయంలో అందరూ మొబైల్స్ పక్కన పెట్టి మాట్లాడుకోవాలి.

బ్రెయిన్ రీ వైరింగ్:- మొబైల్ వాడకం వల్ల పిల్లల మెదడులో డోపమైన్ అనే రసాయనం విడుదలవుతుంది, ఇది వారికి అలవాటుగా మారి వ్యసనంగా మారుతుంది. దీనిని మార్చడానికి మెదడులోని పాత అలవాట్ల మార్గాలను బ్రేక్ చేయాలి.

​పరిష్కారం: ఫోన్ స్థానంలో ఇతర ఆసక్తికరమైన పనులు (శారీరక ఆటలు, డ్రాయింగ్, కధ లు చెప్పుకోవడం) ప్రవేశ పెట్టాలి. వారి మెదడుకు మొబైల్ కంటే మెరుగైన ఉత్సాహం ఇతర పనుల్లో దొరికేలా చేయాలి.

క్వాలిటీ టైమ్:- పిల్లలు ఒంటరిగా ఫీల్ అయినప్పుడే ఎక్కువగా ఫోన్ వైపు మొగ్గు చూపుతారు. తల్లిదండ్రులు వారితో కలిసి ఆడుకోవడం {లేదా} వారి సమస్యలను వినడం వల్ల వారి మానసిక స్థితి మెరుగుపడుతుంది.

చదువుపై ఆసక్తి ఎలా పెంచాలి?:- చదువును ఒక శిక్షగా కాకుండా, ఒక సరదా ప్రక్రియగా మార్చాలి. ​పిల్లల గ్రేడ్ల కంటే, వారు నేర్చుకునే విషయంపై దృష్టి పెట్టండి.
​ప్రతి చిన్న విజయాన్ని అభినందించండి.

నిపుణుల సలహా ఎప్పుడు అవసరం?:- ఒకవేళ మీ పిల్లలు మొబైల్ లేకపోతే విపరీతమైన కోపానికి గురవుతున్నా {లేదా} పూర్తిగా చదువుపై దృష్టి కోల్పోయినా, కేవలం మాటలతో అది సెట్ కాదు. అప్పుడు ‘వైబ్రేటింగ్ హార్ట్స్ వంటి సంస్థల ద్వారా డీప్ లెవెల్ కౌన్సెలింగ్ తీసుకోవడం ఉత్తమం.

​ముఖ్య గమనిక:- మీ పిల్లలను మార్చడానికి ముందు, మీ అలవాట్లను కూడా మార్చుకోండి. మీరు స్క్రీన్ టైమ్ 90% తగ్గించండి. మొదటి మెట్టు, వారిని ప్రేమతో, ఓపికతో మాత్రమే ‘డిజిటల్ వ్యసనం’ నుండి మీరు మీ పిల్లలును కాపాడండి.

Related posts

జియో ఎయిర్‌ఫైబర్ కావాలా? ఇలా బుక్ చేసుకోండి!

Ram Narayana

రూ.2 వేల నోట్లు ఇంకా మార్చుకోలేదా.. గడువు సమీపిస్తోంది త్వరపడండి!

Ram Narayana

My Favorite Road Trip This Year

Ram Narayana