అంతర్జాతీయం

ఇరాన్ యురేనియంపై పుతిన్ ప్రతిపాదనకు నో చెప్పిన ట్రంప్!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన ఓ ప్రతిపాదనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఇరాన్ శుద్ధిచేసిన యురేనియంను రష్యాకు తరలిస్తామని పుతిన్ ప్రతిపాదించగా, ట్రంప్ అంగీకరించలేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరువురు నేతలు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. యుద్ధంలో ఇరాన్‌కు పరిమితస్థాయిలో రష్యా సహకరిస్తుందనే వార్తల నేపథ్యంలో ఇరువురు నేతలు సంభాషించుకున్నారు.

రష్యా నుంచి ఇలాంటి ప్రతిపాదన ఇదే మొదటిసారి కాదని అమెరికా చెబుతోంది. ఇంతకుముందు కూడా పుతిన్ ఇలాంటి ప్రతిపాదనలు చేశారని అమెరికా ప్రతినిధి ఒకరు వెల్లడించారు. యురేనియం సురక్షితంగా ఉండేలా చూసుకోవాలనేది అమెరికా వైఖరి అని తెలిపారు. మరోవైపు, పుతిన్ చేసిన ప్రతిపాదనకు ఇరాన్ కూడా అంగీకరించే అవకాశం లేదని తెలుస్తోంది. యుద్ధానికి ముందు అమెరికాతో జరిగిన చర్చల సమయంలో కూడా ఇరాన్ ఇటువంటి అంశాలను అంగీకరించలేదని తెలుస్తోంది.

Related posts

ఎలాన్ మస్క్ కు షాక్… గ్రోక్ ను బ్లాక్ చేసిన రెండు దేశాలు…

Ram Narayana

పశ్చిమాసియా యుద్ధంలో ఒక పక్క చర్చలు మరో పక్క వార్నింగ్ లు

Ram Narayana

దావోస్ సదస్సులో ట్రూడో, కేటీ పెర్రీల ప్రేమాయణం… కెమెరాకు చిక్కిన రొమాంటిక్ మూమెంట్!

Ram Narayana