Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆయన పక్కనుంటే నా పరువు పోతది.. కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

కేసీఆర్ ఆడే అబద్ధాలకి తన పరువు పోతుంది ఎంపీ కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

ఆ పని చేస్తే ఎమ్మెల్యే, ఎంపీ పదవులకి రాజీనామా చేస్తా

హిట్లర్ బతికుంటే కేసీఆర్‌ని చూసి ఏడ్చి ఉండేవాడు

దళితుల మంత్రి పదవులు లేవు కాని దళిత బంధు పేరుతో మోసం

టీపీసీసీ చీఫ్ పదవి ఆశించి భంగపడిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల హాట్ కామెంట్స్‌తో హల్‌చల్ చేస్తున్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కి డిపాజిట్ కూడా రాదని అన్నా.. ఆ తర్వాత కొద్దిరోజులకి కోపంలో అన్నానని సమర్థించుకున్నా ఆయనకే చెల్లింది. ఇటీవల ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కూడా అధికార టీఆర్‌ఎస్, జిల్లా మంత్రి జగదీశ్వర్‌ రెడ్డిపై ఓ రేంజ్‌లో విమర్శలు చేస్తున్నారు. చౌటుప్పల్‌లో మంత్రి జగదీశ్వర్ రెడ్డి నుంచి మైక్ లాక్కోవాలని చూడడం.. కార్యకర్తల హోరాహోరీ నినాదాలతో యుద్ధ వాతావరణాన్ని తలపించింది.

నిన్న తమ్ముడు అయితే.. ఈ రోజు అన్న ఓ రేంజ్‌లో అధికార పార్టీపై ఘాటు విమర్శలతో రెచ్చిపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. హిట్లర్ బతికుంటే కేసీఆర్‌ని చూసి ఏడ్చి ఉండేవాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. దళితులకు క్యాబినెట్‌లో చోటివ్వరు కానీ.. దళిత బంధు పేరుతో మోసం చేయడం సీఎం కేసీఆర్‌కి బాగా తెలుసని ఆయన ఎద్దేవా చేశారు. దళిత బంధు పెట్టిన రోజే కేసీఆర్ ఓడిపోయినట్టని కోమటిరెడ్డి అన్నారు. సీఎం పక్కన కూర్చుంటే ఆయన ఆడే అబద్ధాలకు తన పరువు పోతదంటూ ఘాటు విమర్శలు చేశారు.

దత్తత గ్రామం వాసాలమర్రికి సీఎం కేసీఆర్ రెండుసార్లు వచ్చారని.. ఎంపీగా తనకు కనీస సమాచారం ఇవ్వలేదని కోమటిరెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రొటోకాల్ కూడా ఇవ్వరని ఆయన ధ్వజమెత్తారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రోడ్లు, పనులు పూర్తి చేస్తే ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు ఇప్పుడే రాజీనామా చేస్తామని కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేయబోమని బాండ్లు రాసిస్తామని ఆయన అన్నారు.

జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రికి పాత నల్లగొండ జిల్లా బౌండరీలు తెలుసా? అని ఆయన ప్రశ్నించారు. రెండేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నా సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ దొరకడం లేదని.. ఎంపీ స్థానంలో ఉండి అపాయింట్‌మెంట్ అడిగితే ఇవ్వడం లేదని ఆయన అన్నారు. మూడు నెలల్లో సీఎం అపాయింట్‌మెంట్ దొరుకుతదా లేదా అని ఆయన మంత్రిని ప్రశ్నించారు.

Related posts

This All-In-One Makeup Palette Makes Packing So Much Easier

Drukpadam

Drukpadam

ఉభయ తెలుగు రాష్ట్రాలలో దంచి కొడుతున్న వర్షాలు…

Drukpadam

Leave a Comment