Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

 గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన శాశ్వత నివాసం వచ్చినట్టు కాదు: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్!

  • గ్రీన్ కార్డు వచ్చినంత మాత్రాన ఎల్లకాలం అమెరికాలో ఉండే హక్కు ఉండదన్న వాన్స్
  • ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని వ్యాఖ్య
  • తమలో ఎవరిని విలీనం చేసుకోవాలో అమెరికన్లు నిర్ణయిస్తారన్న వాన్స్

అమెరికాకు వెళ్లే ప్రతి ఒక్కరి కల అక్కడి గ్రీన్ కార్డు సాధించడమే. గ్రీన్ కార్డు వస్తే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. దీంతో, అమెరికా పౌరులుగా అక్కడే సెటిల్ కావచ్చు. అయితే, అమెరికా గ్రీన్ కార్డుపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన ఎల్లకాలం ఇక్కడ ఉండపోయే హక్కు ఉండదని చెప్పారు. ఇది వాక్ స్వాతంత్ర్యానికి సంబంధించిన అంశం కాదని… దేశ భద్రతకు సంబంధించిన అంశమని అన్నారు. అమెరికా పౌరులుగా తమలో ఎవరిని విలీనం చేసుకోవాలో అమెరికన్లు నిర్ణయిస్తారని చెప్పారు. 

అమెరికా చట్టాల ప్రకారం గ్రీన్ కార్డు పొందిన వ్యక్తి నుంచి కొన్ని సందర్భాల్లో దాన్ని తిరిగి తీసుకోవచ్చు. సుదీర్ఘకాలం అమెరికాలో లేకపోయినా, నేరాలకు పాల్పడినా, వలస నిబంధనలు పాటించడంలో విఫలమైనా గ్రీన్ కార్డును వెనక్కి తీసుకునే అవకాశం ఉంది.

Related posts

ఆసియా క్రీడల్లో అదరగొడుతున్న హైద్రాబాద్ యువతి ఇషా సింగ్ ..

Ram Narayana

హెచ్1-బీ విధానంలో కీలక మార్పు చేయనున్న అమెరికా

Ram Narayana

అద్భుతంగా నేర్చుకునేందుకు… హార్వర్డ్​ వర్సిటీ టెక్నిక్స్​ ఇవే!

Ram Narayana

Leave a Comment