తెలంగాణ వార్తలు

విద్వేషపూరిత ప్రసంగాలు, నేరాల నిరోధక బిల్లుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం..

తెలంగాణ మంత్రివర్గం కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు బిల్లులకు ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా విద్వేషపూరిత ప్రసంగాలు, విద్వేషపూరిత నేరాల నిరోధక బిల్లును (హేట్ స్పీచ్) మంత్రివర్గం ఆమోదించింది. మతసామరస్యానికి భంగం కలిగించే పోస్టులు, అల్లర్లు, ఘర్షణలను ప్రేరేపించే ప్రసంగాలను కట్టడి చేసేందుకు ఈ బిల్లును రూపొందించారు.

దీనితో పాటు సామాజిక భద్రత, కార్మిక సంక్షేమం మరియు మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు పిల్లలు మద్దతుగా ఉండాలనే లక్ష్యంతో పేరెంట్స్ సామాజిక భద్రత బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది. తల్లిదండ్రులను సరిగ్గా ఆదరించని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని నిర్ణయించారు. వారి వేతనం నుంచి 15 శాతం లేదా రూ.10 వేలు నేరుగా తల్లిదండ్రులకు అందేలా చట్టం తీసుకురానున్నారు.

ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో స్వాధీన ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వపరంగా జరగాల్సిన లావాదేవీల నిర్వహణ బాధ్యతను హెచ్ఎంఆర్ఎల్‌కు అప్పగించారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణనపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ సమర్పించిన నివేదికను మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం, న్యాయవాదుల రక్షణ కోసం తీసుకువచ్చే బిల్లులకు ఆమోదం తెలిపింది.

విశ్వవిద్యాలయాల్లో వివక్షను అరికట్టేందుకు ‘రోహిత్ వేముల’ చట్టం విధివిధానాల కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉంటారు. 

Related posts

ఖమ్మం నుంచి హైద్రాబాద్ కు నాన్ స్టాప్ బస్సు లు …ఎల్బీనగర్ కు ప్రయాణం 3 గంటలు!

Ram Narayana

హైదరాబాద్ అంటే చార్మినార్.. ట్యాంక్‌బండ్… నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తుకు వస్తాయి: రేవంత్ రెడ్డి

Ram Narayana

ఉచిత బస్సు సర్వీస్ పై భిన్నాభిప్రాయాలు …ప్రభుత్వం పునరాలోచన చేస్తుందా …?

Ram Narayana