సుప్రీం కోర్ట్ వార్తలు

పెద్దిరెడ్డి కుటుంబానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ…

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. తమ కంపెనీకి ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డికి చెందిన పీఎల్‌ఆర్ కంపెనీ, చిత్తూరు జిల్లాలో చేపట్టిన రోడ్డు పనులకు సంబంధించిన బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బిల్లులను వెంటనే విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పెద్దిరెడ్డి సతీమణి పేరుతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై నిన్న జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోలేమని, దీనికి సరైన వేదిక హైకోర్టేనని అభిప్రాయపడింది. ఇదే అంశంపై ఇప్పటికే ఏపీ హైకోర్టులో 12 కేసులు నడుస్తున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లినా, ధర్మాసనం తన వైఖరిని మార్చుకోలేదు. సుప్రీంకోర్టు సూచన మేరకు.. పిటిషనర్లు తమ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

Related posts

ఎన్నికలకు ముందు ఎంతమందినని జైల్లో పెడతారు?: సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు

Ram Narayana

సాక్షులను బెదిరిస్తే ఇకపై నేరుగా ఎఫ్ఐఆర్… సుప్రీంకోర్టు కీలక తీర్పు

Ram Narayana

సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా కపిల్ సిబల్ ఘనవిజయం …

Ram Narayana