అంతర్జాతీయం

ప్రవాస భారతీయులు ఏళ్లుగా వేచిచూస్తున్న కీలక బిల్లుకు కెనడా ఆమోదం…

కెనడా చట్టసభ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. విద్వేషపూరిత చర్యలు, నేరాలను అరికట్టేందుకు తీసుకొచ్చిన కంబాటింగ్ హేట్ (సీ9 బిల్లు) బిల్లుకు ఆ దేశ చట్టసభ ఆమోదం తెలిపింది. ఈ కీలక బిల్లుకు హౌస్ ఆఫ్ కామన్స్ ఆమోదముద్ర వేయగా, అనంతరం దీనిని ఎగువసభకు పంపించారు.

ఇది అమలులోకి వస్తే ప్రార్థనా స్థలాలపై దాడులు, ఖలిస్థానీ మద్దతుదారుల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చట్టం ప్రకారం విద్వేష చిహ్నాలను బహిరంగంగా ప్రదర్శించడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఈ చట్టం కోసం కెనడాలోని భారత సంతతి వ్యక్తులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నారు.

కెనడాలో ఖలిస్థానీల ఆగడాలు పెరిగిపోయిన విషయం తెలిసిందే. కొన్ని వర్గాల వారిని లక్ష్యంగా చేసుకుంటూ బెదిరింపులకు పాల్పడుతుండటం, విధ్వంసం సృష్టించడం తదితర ఘటనలు పెరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలపై అక్కడి భారతీయులు చాలా ఏళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో విద్వేష చర్యలకు సంబంధించి కొత్త బిల్లు ఆమోదం పొందడం గమనార్హం.

Related posts

2026 మార్చి15న ఆస్కార్ అవార్డుల వేడుక

Ram Narayana

ఆ విమానం తిరిగి షికాగో వెళ్లడంపై ఎయిరిండియా వివరణ!

Ram Narayana

జపాన్‌లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం…

Ram Narayana