తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీఆర్ఎస్తీర్థంపుచ్చుకున్నమాజీమంత్రితాటిపర్తిజీవన్రెడ్డి

బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా: కేటీఆర్‌తో భేటీ అనంతరం జీవన్ రెడ్డి

Jeevan Reddy Decides to Join BRS After Meeting with KTR

ఇంకాఎన్నికలకురెండున్నరేళ్లుసంవత్సరాలగడువుఉంది…కానీరాష్ట్రంలోరాజకీయాలుఒక్కసారిగావేడెక్కాయి.. గతశాసనసభఎన్నికల్లోబీఆర్యస్నుంచిగెలుపొందినడాక్టర్సంజయ్కుమార్కాంగ్రెస్కుఅనుకూలంగామారడంజీవన్రెడ్డిమాటనియోజకవర్గంలోచెల్లుబాటుకాకపోవడంతోతీవ్రఅసంతృప్తితోఉన్నజీవన్రెడ్డిచివరకుఇటీవలనేకాంగ్రెస్పార్టీకిబైచెప్పిబీఆర్యస్లోచేరేందుకునిర్ణయించుకున్నారు. దీన్నికేసీఆర్కుచేరవేయడంలోఆయనఆదేశాలమేరకుకేటీఆర్స్వయంగాజగిత్యాలకువచ్చిజీవన్రెడ్డినిబీఆర్యస్లోకిఆహ్వానించారు. ఆయనఆహ్వానాన్నిఅంగీకరించినజీవన్రెడ్డిబీఆర్ఎస్తీర్థంపుచ్చుకున్నారు…శుక్రవారంఆయన్నుపార్టీలోకిఆహ్వానించేందుకువెళ్లినబీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్సమక్షంలోఆయనగులాబీకండువాకప్పుకున్నారు.దీంతోఆయనలాంఛనంగాబీఆర్ఎస్పార్టీలోచేరినట్లుఅయింది.జీవన్రెడ్డితనకుపార్టీలోజరుగుతున్నఅవమానాలనుభరించలేకనేపార్టీనివీడారనిరాజకీయపరిశీలకులఅభిప్రాయం..అయితేఆయనబీఆర్యస్లోచేరినసమయంసందర్భంసరిగాలేదనిఅభిప్రాయాలూఉన్నాయి… తొందరపడ్డారనేఅభిప్రాయాలూవ్యక్తంఅవుతున్నాయి.

తాను బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి ప్రకటించారు. శేషజీవితంలో కేసీఆర్‌తో పనిచేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తే రాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా పాటుపడవచ్చని పేర్కొన్నారు.

అంతకుముందు, జగిత్యాలలో జీవన్ రెడ్డిని బీర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. హైదరాబాద్ నుంచి జగిత్యాలకు చేరుకున్న కేటీఆర్… జీవన్ రెడ్డితో ఆయన నివాసంలో గంటకు పైగా సమావేశమయ్యారు. ఈ సందర్బంగా శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేటీఆర్ వెంట ఎల్. రమణ, పాడి కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు ఉన్నారు.

బీఆర్ఎస్ పాలనే భేష్.. రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదు: జీవన్ రెడ్డి

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని జీవన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనతో పోలిస్తే, కేసీఆర్ నేతృత్వంలోని పదేళ్ల బీఆర్ఎస్ పాలనే చాలా బాగుందని ఆయన కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదని, ఆయన పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts

ఖమ్మమా మజాకానా … !రాష్ట్ర మంత్రివర్గంలో ముగ్గురు మంత్రులు….

Ram Narayana

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్?

Ram Narayana

స్టేషన్ ఘన్‌పూర్‌లో భగ్గుమన్న రాజకీయాలు.. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య గృహ నిర్భంధం!

Ram Narayana