సీఎం జగన్‌ను కలిసిన కేంద్ర మంత్రి..
విజయవాడలో బిజీబిజీగా కిషన్ రెడ్డి,
కారు వెక్కుతుండగా అపశ్రుతి
రాజకీయాల్లో శత్రువులు మిత్రులు ఎవ్వరు ఉండరని అన్ని తాత్కాలిక సర్దుబాట్లేనని అనేక సార్లు రుజువయ్యాయి . అందులో భాగంగానే ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర పర్యాటక శాఖామంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ పై ధ్వజమెత్తారు . పాలనా పక్ష పాఠంగా ఉందని దుయ్యబట్టారు. తిరుపతిలో , విజయవాడలో జరిగిన సభల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి ,సీఎం జగన్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో సతి సమేతంగా వెళ్లి కలుసుకున్నారు. వారిని జగన్ దంపతులు సాదరంగా ఆహ్వానించి జ్నపికలు అందించారు. అనంతరం ఆయన విజయవాడ సభలో పాల్గొని జగన్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించటం కొసమెరుపు …..
ఏపీ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్‌ను కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లి జగన్ నివాసానికి వెళ్లిన కిషన్ రెడ్డిని సీఎం వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. కుటుంబ సభ్యులతో కలసి వచ్చిన కేంద్ర మంత్రిని జగన్, భారతి దంపతులు సత్కరించారు. కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి శాలువా కప్పి, జ్ఞాపికను అందజేశారు. కిషన్‌రెడ్డి దంపతులకు సీఎం జగన్ దంపతులు వేంకటేశ్వర స్వామి ప్రతిమ అందజేసి నూతన వస్త్రాలు బహూకరించారు.
అనంతరం ఆయన విజయవాడ జన ఆశీర్వాద యాత్రకు బయలుదేరారు. జన ఆశీర్వాద యాత్రలో స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కారు ఎక్కుతున్న సమయంలో తలకు స్వల్ప గాయమైంది. ఆయన తిరిగి వెళ్లేందుకు కారు ఎక్కే సమయంలో ఫోటోలు దిగేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. అదే సమయంలో కారు డిక్కీ తీసి వేస్తుండగా కిషన్ రెడ్డి తలకు తలిగి గాయమైంది. వెంటనే వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. గాయాన్ని లెక్క చేయకుండా ఆయన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కనకదుర్గమ్మ ఆలయాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు తన వంతు హకారం అందిస్తానని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సాదర స్వాగతం పలికారు. సీఎం జగన్ మర్యాదపూర్వకంగానే ఆహ్వానించారని, తెలుగు వారికి కేంద్రమంత్రి అవకాశం రావడంతోనే తేనేటి విందుకు ఆహ్వానించారని తన భేటీ వివరాలు తెలియజేశారు.