Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మంత్రి పువ్వాడ పై భట్టి ధ్వజం వెనక వ్యూహం ఏమిటి ?

మంత్రి పువ్వాడ పై భట్టి ధ్వజం వెనక వ్యూహం ఏమిటి ?
-మంత్రి అహంకారంగా వ్యహరిస్తున్నారా ?
-కాంట్రాక్టులు అన్ని తానే చేస్తున్నాడా?
-పనులన్నీ నాశిరకమేనా?
-కోట్లాది రూపాయల భూములు కబ్జా చేశాడా?
ఉన్నట్టు ఉండి సీఎల్ఫీ నేత మల్లు భట్టి విక్రమార్క జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై ధ్వజం ఎత్తడం వెనక వ్యూహం ఏమైనా ఉందా?…….. మంత్రి అహంకారంగా వ్యహరిస్తున్నారా ?……కాంట్రాక్టులు అన్ని తానే చేస్తున్నాడా?…….పనులన్నీ నాశిరకమేనా? ……కోట్లాది రూపాయల భూములు కబ్జా చేశాడా?….. అంటే భట్టి ధ్వజం ఎత్తడం వెనక కచ్చితంగా వ్యూహం ఉందనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి. లేక పొతే మంత్రి అజయ్ పై ప్రత్యేకంగా ఏనాడూ నోరు విప్పని భట్టి ఒక్కసారిగా ఆయనపై దాడి చేయటం ఏమిటనే అభిప్రాయాలే ఉన్నాయి. అజయ్ అహంకార పూరితంగా వ్యవహరిస్తారని ,కేసులు పెట్టిస్తారని , వేలాది గజాల భూములు జి .ఓ నెంబర్ 58 ,59 ద్వారా కాజేశారని ఆయన చెప్పిన విషయాలలో ఒక్కటి కొత్తది లేకపోవడం గమనార్హం . ఖమ్మం నగర మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా విఫలమైయ్యారని విమర్శలు చేశారు. కాంట్రాక్టులు ఆయన బినామీ సంస్థకు గానీ లేదా ఆయన చెప్పినవారికి మాత్రమే కాంట్రాక్టులు ఇస్తున్నారని ఆరోపణలు చేశారు. వీటిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిజంగా నగరంలో జరుగుతున్నా పనులపై ,వాటి నాణ్యత పై విమర్శలు చేయటంలో తప్పులేదు. కోట్లాది రూపాయలు దుర్వినియోగం ఆరోపణలపై విచారణ జరపాల్సిందే ? వాటిపై టీఆర్ యస్ గాని మంత్రి అజయ్ గానీ సమాధానం చెప్పాల్సిందే . మంత్రి తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని భట్టి ఆరోపణ . భట్టి చేసిన విమర్శలపై టీఆర్ యస్ కౌంటర్ ఇస్తుందనుకుంటా ? . ఖమ్మం నగర అభివృద్ధిపై ఛాలంజ్ కూడా గతంలో చేసింది ఇప్పుడు చేస్తుందనుకుంటా . కాంగ్రెస్ హయాంలో కన్నా ఎక్కువ అభివృద్ధి చేశామని చెబుతుంది. దానికి కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా ఉండాల్సి ఉంది. ఖమ్మం నగర కార్పొరేషన్ కు త్వరలో ఎన్నికలు జరగ నున్నాయి . ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నాయి. దీనిలో భాగంగా భట్టి ఇటీవల కాలంలో ఖమ్మం పై ద్రుష్టి కేంద్రీకరించారు. ఖమ్మం కార్పొరేషన్ లో కాంగ్రెస్ జెండా ఎగర వేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఆ ఎత్తుగడలలో భాగంగానే ఆయన విమర్శలకు పదును పెడుతున్నారు. క్యాడర్ ను ఉత్సాహ పరుస్తున్నారు. ఖమ్మం శాసన సభ్యుడిగా , జిల్లా మంత్రిగా ఉన్న అజయ్ నే టార్గెట్ చేయాల్సి ఉంది. పైగా అజయ్ ఖమ్మం కార్పొరేషన్ గెలిపించాల్సిన ఉంది . మంత్రి కేటీఆర్ , ముఖ్యమంత్రి కేసీఆర్ డైరక్షన్ లో ఇప్పటికే వ్యూహాత్మకంగా పనిచేస్తున్నారు. టీఆర్ యస్ ఖమ్మం కార్పొరేషన్ పై తిరిగి గులాబీ జెండా వేగరవేయాల్సిన భాద్యత అజయ్ పైనే ఉంది. అందువల్ల అజయ్ పై విమర్శలు ఎక్కుపెట్టడం సహజం . ఇటీవలనే జిల్లా పర్యటనకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం మంత్రి అజయ్ పై విమర్శలు గుప్పించారు. పదునైన పదాలు ప్రయోగించారు. దానికి తగ్గట్లుగానే మంత్రి కౌంటర్ ఇచ్చారు. ఇంతకాలం విమర్శలకు తావులేకుండా ఉన్న మంత్రిపై ప్రతిపక్షాలు బాణాలు ఎక్కుపెట్టాయి. ఆయన వాటిని తప్పించుకుంటారో ,తిప్పికొడతారో , అందులో ఇరుక్కుంటారో చూడాలి మరి ?

Related posts

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి అరెస్ట్!

Drukpadam

ప్రధాని మోడీ ,అదానీకి ఉన్న బంధంపై పార్లమెంట్ లో నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ..!

Drukpadam

బడా బూర్జవపార్టీల విధానాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. –తమ్మినేని

Drukpadam

Leave a Comment