Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

భట్టి నోరు అదుపులో పెట్టుకో

భట్టి నోరు అదుపులో పెట్టుకో
-మంత్రి పై తప్పుడు ఆరోపణలు సహించేది లేదు
-అభివృద్ధి పై బహిరంగ చర్చ కు సిద్ధం
-విలేకర్ల సమావేశంలో టీఆరెస్ నేతలు
నెలకు,రెండు నెలల కోమారు జిల్లా కేంద్రానికి వచ్చి రాజకీయ లబ్దికోసం రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని జడ్పీ చైర్మన్ లింగాల కమల రాజు హెచ్చరించారు.జిల్లా కేంద్రంలో అభివృద్ధి జరగలేదని,మంత్రి పై ఆరోపణలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.ఈ మేరకు టీఆరెస్ పార్టీ జిల్లా కార్యాలయం ఖమ్మం తెలంగాణా భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం,ఖమ్మం కార్పొరేషన్ మేయర్ డా.జి.పాపాలాల్, సుడా చైర్మన్ బచ్చు విజయ్,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్,పార్టీ జిల్లా కార్యాలయ ఇంచార్జి గుండాల(ఆర్జేసీ)కృష్ణ లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.తాను ఖమ్మం వచ్చినట్లు తెలియడం కోసం ఆరోపణలు,అసత్య ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.నెల రోజులు ఖమ్మం లో లేని సామాన్య ప్రజలు తిరిగి వచ్చాక అభివృద్ధి బాగా చర్చించు కుంటుంటే ఆ అభివృద్ధి సీఎల్పీ నేత గా ఉన్న భట్టీ విక్రమార్క కు కనిపించక పోవడం శోచనీయం అన్నారు.కాంగ్రెస్ హయాంలో కనిపించని లకారం అభివృద్ధి టీఆరెస్ హయాంలో మంత్రి అజయ్ ఆధ్వర్యంలో అభివృద్ధి చెంది ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడంతోపాటు, ఆరోగ్యాన్ని అందిస్తుందన్నారు.ప్రతీ సారి 58,59 జీవో పై మంత్రి భూమిని ఆక్రమించారంటూ ఆరోపణలు చేయడాన్ని తప్పు పట్టారు.పేద ప్రజలకు వైద్య సేవలు అందించే మమత వైద్యశాల కు అవసరమైతే దానిని రూ.రెండు కోట్ల రూపాయలతో సక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారన్నారు.ఖమ్మం లో జరిగిన అభివృద్ధి పై బహిరంగ చర్చ కు సిద్ధంగా ఉన్నామని,నువ్వు సిద్ధమేనా అని సవాల్ విసిరారు.వాస్తవాలు ఇలా ఉంటే కేవలం రాజకీయ లబ్ది కోసం మంత్రిపై ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. భట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు.ఈ విలేకరుల సమావేశంలో ఖమ్మం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి,పార్టీ నగర అధ్యక్షులు కమర్తపు మురళి,మైనార్టీ సెల్ నగర అధ్యక్షులు తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు……

Related posts

పార్లమెంట్ కొత్త భవనం.. ఎన్నో ప్రత్యేకతల నిలయం

Drukpadam

కిడ్నాప్ అయ్యాననుకుని.. ఉబర్ డ్రైవర్‌పై కాల్పులు జరిపిన మహిళ…

Drukpadam

2022లో జపాన్ దే పవర్ ఫుల్ పాస్ పోర్ట్.. ఇండియా స్థానం ఎంతంటే..!

Drukpadam

Leave a Comment