Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జిన్నాను హత్య చేసి ఉంటె ….శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ……

గాంధీని కాకుండా జిన్నాను హత్య చేసి ఉంటే దేశ విభజన జరిగేది కాదు: శివసేన
జిన్నాను హత్య చేసి ఉంటే విభజన ఘోరాలు గుర్తుకొచ్చే రోజు అవసరం ఉండేది కాదు
మన దేశ విభజన గాయం ఎలా మానుతుంది?
అఖండ హిందుస్థాన్ సాధ్యమయ్యేలా లేదు

శివసేన స్వతంత్ర ఉద్యమం నాటి గాయాలను తిరిగి తోడింది. ….గాంధీని కాకుండా జిన్నా ను నాథురాం గాడ్సే చంపి ఉంటె దేశ విభజన జరిగేదికాదని వ్యాఖ్యానించింది. తనపత్రిక సామ్నా సంపాదకీయంలో ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడంతో చర్చనీయాంశంగా మారాయి. జిన్నా వల్లనే భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయిందని శివసేన అభిప్రాయం . అందువల్లనే ఆయన సంపాదకీయం లో రాసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.

ఆఫ్ఘనిస్థాన్ లో నెలకొన్న పరిస్థితులను భారతదేశ విభజన నాటి పరిస్థితులతో పోల్చుతూ శివసేన తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక గొప్ప దేశ ఉనికి, సార్వభౌమత్వ విధ్వంసం బాధిస్తోందని వ్యాఖ్యానించింది. దేశ విభజననాటి పరిస్థితుల గురించి తన అధికార పత్రిక ‘సామ్నా’లో ప్రచురించిన కథనంలో ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఈ ఎడిటోరియల్ ను శివసేన కీలకనేత, ఎంపీ సంజయ్ రౌత్ రాశారు. ఆనాడు మహాత్మాగాంధీని కాకుండా మహమ్మద్ అలీ జిన్నాను నాథూరాం గాడ్సే హత్య చేసి ఉంటే భారతదేశ విభజన జరిగి ఉండేది కాదని అన్నారు. అదే జరిగి ఉంటే దేశ విభజన ఘోరాలు గుర్తుకొచ్చే రోజు అవసరం ఉండేది కాదని వ్యాఖ్యానించారు.

ఒక దేశ సార్వభౌమాధికారం, అస్తిత్వం విధ్వంసాల తాలూకు బాధ ఎలా ఉంటుందో ప్రస్తుత ఆప్ఘనిస్థాన్ పరిస్థితులు గుర్తు చేస్తున్నాయిని సంజయ్ రౌత్ తన ఎడిటోరియల్ లో పేర్కొన్నారు. మన దేశం విషయానికి వస్తే… విభజన గాయం ఎలా మానుతుందని ప్రశ్నించారు. విడిపోయిన ముక్కను కలుపుకోకపోతే విభజన గాయం నుంచి ఉపశమనం లభించదని అన్నారు. అఖండ హిందుస్థాన్ ఏర్పడాలని మనం కోరుకుంటున్నప్పటికీ… అది సాధ్యమయ్యేలా లేదని చెప్పారు. ప్రధాని మోదీ అఖండ హిందుస్థాన్ ను కోరుకుంటే శివసేన స్వాగతిస్తుందని తెలిపారు.

Related posts

అర్చకులకు, బ్రాహ్మణ విద్యార్థులకు కేసీఆర్ గుడ్ న్యూస్…!

Drukpadam

ఏపీ లో పెట్రో ధరలు తగ్గించాల్సిందే …ఆందోళనలకు చంద్రబాబు పిలుపు ….

Drukpadam

వద్దురా నాయన మోడీ పాలన … స్వయంగా మంత్రి హరీష్ రావు నినాదాలు!

Drukpadam

Leave a Comment