Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

చ‌లానా ఉంటే వాహ‌నాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదంటూ త‌ప్పుడు ప్ర‌చారం: -సైబ‌రాబాద్ పోలీసులు!

చ‌లానా ఉంటే వాహ‌నాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదంటూ త‌ప్పుడు ప్ర‌చారం: -సైబ‌రాబాద్ పోలీసులు
-పోలీసులు వాహనాలను సీజ్ చేయొచ్చు
-మోటార్‌ వెహికిల్ నిబంధ‌న‌లు–1989 రూల్‌ 167 ఇదే చెబుతోంది
-త‌ప్పుడు ప్ర‌చారాలు చేయకూడ‌దు

ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే పోలీసులు చ‌లానాలు వేస్తార‌న్న విష‌యం తెలిసిందే. అయితే, చలానాలు చెల్లించకుంటే వాహనాలను సీజ్‌ చేసే అధికారం ట్రాఫిక్‌ పోలీసులకు లేదంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని సోషల్‌ మీడియాలో ఇటీవ‌ల పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. దీంతో పోలీస్ శాఖ అధికారులు వస్తున్నా వార్తలను కొట్టి పారేశారు. చట్టం లో ఎక్కడ చలన ఉన్న వెహికల్స్ ను సీజ్ చేయకూడదని లేదని అన్నారు .పైగా సెంట్రల్‌ మోటార్‌ వెహికిల్ నిబంధ‌న‌లు–1989 రూల్‌ 167 ప్రకారం 90 రోజులకు పైగా ట్రాఫిక్‌ చలానాలు పెండింగ్‌ ఉన్న వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉందని సైబరాబాద్ పోలిస్ కమిషనరేట్ తెలిపింది.

వాహ‌నానికి ఒక్క చలానా పెండింగ్‌లో ఉన్నప్ప‌టికీ వాహనాన్ని జప్తు చేసే అధికారం ట్రాఫిక్‌ పోలీసులకు లేదని ప్ర‌చారం జ‌రుగుతోంది. సోషల్‌ మీడియాలో ప్ర‌చారం అవుతోన్న ఈ పోస్ట్ పై సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు స్ప‌ష్ట‌త‌నిచ్చారు. హైకోర్టు అలాంటి ఆదేశాలు ఏమీ ఇవ్వలేదని తెలిపారు.

ప్రజలను గందరగోళానికి గురి చేస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకూడ‌ద‌ని చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించే వారి వాహనాలను సీజ్‌ చేసే అధికారం తమకు ఉంటుందని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. సెంట్రల్‌ మోటార్‌ వెహికిల్ నిబంధ‌న‌లు–1989 రూల్‌ 167 ప్రకారం 90 రోజులకు పైగా ట్రాఫిక్‌ చలానాలు పెండింగ్‌ ఉన్న వాహనాలను అదుపులోకి తీసుకునే అధికారం పోలీసులకు ఉందని ట్రాఫిక్‌ పోలీసులు చెప్పారు.

చలానా గురించి వాహనదారునికి ఎలక్ట్రానిక్‌ రూపంలో లేదా కాల్‌ ద్వారా పోలీసులు ఒక్కసారైనా తెలియజేస్తే చాలని తెలిపారు. అలాగే, త‌మ వాహ‌నానికి ఏమైనా ట్రాఫిక్‌ ఉల్లంఘన చలానాలు ఉన్నాయా? అని తనిఖీ చేసుకోవాల్సిన బాధ్యత వాహనదారులదేన‌ని తెలిపారు.

చలానాలు ఉన్నప్పటికీ పోలిసులకు వాహనాలను సీజ్ చేసే అధికారం లేదని ఇటీవల గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో అనేక వార్త కథనాలు కూడా వచ్చాయి. దీనిపై పోలీసులు స్పందించారు.

Related posts

టీవీ సెట్‌టాప్‌ బాక్స్‌ షాక్ కొట్టి నాలుగేళ్ల బాలుడి మృతి

Ram Narayana

బాలికపై అత్యాచారం.. సాయం కోసం అర్ధించినా స్పందించని జనం.!

Ram Narayana

చిన్నారి అత్యాచారం ఘటనపై ఒక్క మంత్రి కూడా స్పందించలేదు: రేవంత్ రెడ్డి ఆగ్రహం!

Drukpadam

Leave a Comment