Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణ ఆదాయం దూసుకుపోతుంది. ఆర్థిక మంత్రి హరీష్ రావు!

తెలంగాణ ఆదాయం దూసుకుపోతుంది. ఆర్థిక మంత్రి హరీష్ రావు!
-బంగ్లాదేశ్ కంటే భార‌త‌ ఆర్థిక వృద్ధి త‌క్కువ‌గా ఉంది
-బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వ పాల‌న‌లో ఆర్థిక వృద్ధి ప‌డిపోతోంది
-భారత్ తలసరి ఆదాయం కంటే బంగ్లాదేశ్‌ తలసరి ఆదాయమే ఎక్కువ
-దేశం కంటే తెలంగాణ 3 శాతానికి పైగా వృద్ధి రేటు సాధించింది

తెలంగాణ రాష్ట్రం త‌మ ప్ర‌భుత్వ పాల‌న‌లో ఆర్థికవృద్ధి సాధిస్తోంద‌ని రాష్ట్ర మంత్రి హ‌రీశ్ రావు చెప్పారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వ పాల‌న‌లో భార‌త‌ ఆర్థిక వృద్ధి బంగ్లాదేశ్ కంటే తక్కువగా ఉందని విమ‌ర్శించారు. భారత్‌ తలసరి ఆదాయం కంటే బంగ్లాదేశ్‌ తలసరి ఆదాయమే ఎక్కువని గుర్తు చేశారు. తెలంగాణ మాత్రం ఆర్థిక వృద్ధిని సాధిస్తూ దూసుకుపోతోంద‌ని తెలిపారు.

రాష్ట్రం 11.7 శాతం ఆర్థిక వృద్ధి రేటును నమోదు చేసిందని, తలసరి ఆదాయంలోనూ వృద్ధి సాధించిందని తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,37,632గా ఉందని, ఇది దేశ తలసరి ఆదాయం కంటే 1.84 రెట్లు ఎక్కువ అని తెలిపారు. దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న మూడో రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.

ఒక పక్క అప్పులు ఎక్కువ అవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వేతనాలు ఇచ్చేందుకు ఆపసోపాలు పడుతున్న వేళ మన ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు మాత్రం తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని అంటున్నారు. మంచిదే అమాత్య ….మీరు చెప్పేది నిజం కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కానీ మాటలకూ చేతలకు పొంతన లేకుండా ఉన్న ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. అభివృద్ధి కుంటుపడింది   విమర్శలు మూట గట్టుకున్నారు. ఇప్పటికైనా నిజాలు చెపితే ప్రజలు సంతోషిస్తారు. కానీ అది జరగటం లేదనే అభిప్రాయాలే ఉన్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి బాగా లేని విషయం పక్కన పెట్టండి. ముందు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రకటించాలని కోరుకుంటున్నారు.

Related posts

జ‌ర్న‌లిస్ట్‌ పాస్ హోల్డ‌ర్స్‌కు టీఎస్ ఆర్టీసీ శుభ‌వార్త‌

Drukpadam

ఎన్నికలను ఆరు రోజులపాటు వాయిదా వేయండి: ఈసీకి లేఖ రాసిన పంజాబ్ సీఎం!

Drukpadam

మహా ధర్నాలో కేసీఆర్.. యుద్ధం ప్రారంభమైందన్న సీఎం!

Drukpadam

Leave a Comment