Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఇంకా పదేళ్లు నేనే ముఖ్యమంత్రి…కేసీఆర్

ఇంకా పదేళ్లు నేనే సీఎం… నా ఆరోగ్యం బాగానే ఉంది: సీఎం కేసీఆర్

👉ముగిసిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. 👉

ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్

👉కాబోయే సీఎం కేటీఆర్ అనే ప్రచారంపై స్పందన

👉మంత్రులు, ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాబోయే సీఎం కేటీఆర్ అంటూ ఇటీవల జరుగుతున్న ప్రచారానికి దాదాపుగా తెరదించారు. వచ్చే పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, తన ఆరోగ్యంగా బాగానే ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. సీఎం పదవి విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సంమయనం పాటిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఏది అవసరమో అదే మాట్లాడాలని, అవసరం లేని విషయాల జోలికి వెళ్లవద్దని సున్నితంగా మందలించారు. ఒకవేళ సీఎం పదవిలో మార్పు ఉంటే ఆ విషయాన్ని తానే వెల్లడిస్తానని అన్నారు.

ఇక పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపైనా సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ నెల 12 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు ఉంటుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 50 వేల సభ్యత్వాలు నమోదు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.సంయమనం పాటించాలని హితవు

అనవసర విషయాల జోలికి వెళ్లొద్దని మందలింపు

Related posts

అందుకే తెలంగాణ ప్రజలు రాష్ట్ర విభజన కోరుకున్నారు: ధర్మాన ప్రసాదరావు

Drukpadam

పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి ధ్వజం …

Ram Narayana

భారత్ బంద్ నేపథ్యంలో.. హైవేలపై ట్రాఫిక్ జామ్ లు…

Drukpadam

Leave a Comment