Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మమతా బెనర్జీపై కేంద్రం ఆగ్రహం… ప్రధాని మీకోసం వేచి చూడాలా అని మండిపాటు

మమతా బెనర్జీపై కేంద్రం ఆగ్రహం… ప్రధాని మీకోసం వేచి చూడాలా అని మండిపాటు
ప్రధాని అరగంట సేపు మీ కోసం వేచిచూడాలా… అంత అహంకారమా?
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మోదీ ఏరియల్ సర్వే
ప్రధానిని మమత అసహనానికి గురిచేశారన్న కేంద్రం
ప్రభుత్వం నుంచి ఒక్కరూ రాలేదని ఆరోపణ
షెడ్యూల్ ప్రకారమే వచ్చామన్న మమత

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పశ్చిమ బెంగాల్ లో యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. అయితే, సీఎం మమతా బెనర్జీ ప్రధానికి అసహనం కలిగించారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కలైకుంద ఎయిర్ బేస్ వద్ద మమతా బెనర్జీ కోసం ప్రధాని మోదీ, రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధంకర్ దాదాపు 30 నిమిషాల సేపు వేచి చూడాల్సి వచ్చిందని వెల్లడించాయి. తుపాను సమీక్ష కోసం ప్రధాని వస్తే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి ఒక్కరూ రాలేదని ఆరోపించాయి.

దేశ చరిత్రలో ఇంత నీచంగా ప్రవర్తించిన సీఎం మరొకరు లేరని కేంద్రం వర్గాలు మండిపడ్డాయి. ఈ ముఖ్యమంత్రికి ఇంగితజ్ఞానం లేదు, అహంకారి అంటూ విమర్శించాయి. అయితే, దీనిపై మమత వాదన మరోలా ఉంది. వాస్తవానికి ప్రధానిని తాము ధిఘా వద్ద కలుస్తామని సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. అయితే, ప్రధానిని కలైకుంద ఎయిర్ బేస్ వద్ద కలవాలని కేంద్ర ప్రభుత్వం మమతకు సూచించింది. దాంతో మమత అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.

కాగా, దీనిపై మరో వాదన కూడా తెరపైకి వచ్చింది. మమతకు బద్ధ విరోధి అయిన సువేందు అధికారి ప్రధాని పక్కనే ఉండడంతో మమత తీవ్ర అసంతృప్తికి గురయ్యారని ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోడీ బెంగాల్ ,ఒడిశా లోని యాస్ తుఫాన్ దెబ్బతిన్న ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా చూశారు.ప్రధానితోపాటు నందిగ్రాంలో ఆమె పై గెలిచినా బెంగాల్ ప్రతిపక్షనేత సువెందు అధికారి ఉండటంతో ఆమె అగ్గిమీద గుగ్గిలమైయ్యారు . ఇక ప్రధానితో కేవలం 15 నిముషాలు మాత్రమే గడిపిన మమతా తనకు ముందుగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలు ఉన్నందున వెళుతున్నట్లు చెప్పి వెళ్లి పోయారు.

దీనిపై బెంగాల్ ప్రభుత్వ వర్గాలు స్పష్టత నిచ్చాయి. మమతా బెనర్జీకి అనేక కార్యక్రమాలు ఉండడంతో ఆమె ప్రధానితో భేటీకి కూడా కొంత సమయం కేటాయించారని, ముందు నిర్ణయించిన షెడ్యూల్ మేరకే అమె వచ్చారని, ఇక ప్రధానిని ఎందుకు వేచిచూసేలా చేస్తారంటూ ప్రశ్నించాయి.

 

మమతా బెనర్జీ తీరుపై గవర్నర్ అసంతృప్తి

పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ప్రధాని నేతృత్వంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి, ఇతర అధికారులు హాజరుకావాల్సి ఉంది. కానీ, అలా జరగలేదు. ముఖాముఖి వైఖరి రాష్ట్ర లేదా ప్రజాస్వామ్య ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. సీఎం, అధికారులు పాల్గొనకపోవడం రాజ్యాంగబద్ధత లేదా చట్ట నియమాలతో సమకాలీకరించబడదు ‘ అని బెంగాల్ గవర్నర్ జగదీప్ ధనఖర్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.

మోడీతో భేటీ అయ్యానంటూ మమత.

.20వేల కోట్లు కావాలంటూ.. అయితే, ప్రధాని మోడీ సమీక్ష సమావేశం గురించిన సమాచారం తనకు సరైన సమయంలో అందలేదని మమతా బెనర్జీ చెప్పారు. తాను ప్రధానమంత్రిని ప్రత్యేకంగా కలిసి రాష్ట్రంలో తుఫాను కారణంగా కలిగిన నష్టాన్ని వివరించినట్లు మమతా బెనర్జీ తెలిపారు. ఆ సమయానికి సమావేశ గదిలోకి ఎవరూ రాలేదని చెప్పారు. జరిగిన నష్టంపై పత్రాలను అందజేసిన మమతా బెనర్జీ.. రూ. 20వేల కోట్ల సాయాన్ని కోరారు. ఆ తర్వాత ఆమె సీఎస్ తోపాటు తుఫాను ప్రభావిత దిఘాకు వెళ్లిపోయారు.

Related posts

వివేకా హత్యకు రూ.8 కోట్లు సుపారీ ఇచ్చినట్టు తెలిసినా… ప్రభుత్వంలో కదలిక లేదు: వర్ల రామయ్య!

Drukpadam

రాహుల్ గాంధీ ఈడీ విచారణపై దేశవ్యాపితంగా కాంగ్రెస్ నిరసనలు …

Drukpadam

50 రోజుల్లో 5 రాష్ట్రాలు… 50వ రోజు 26 కిలోమీటర్లు నడిచిన రాహుల్!

Drukpadam

Leave a Comment