Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తాలిబ‌న్లు తీవ్రంగా కొట్టారు: టోలో న్యూస్ జ‌ర్న‌లిస్టు…

తాలిబ‌న్లు తీవ్రంగా కొట్టారు: టోలో న్యూస్ జ‌ర్న‌లిస్టు
-జ‌ర్న‌లిస్టు చ‌నిపోయాడ‌ని వ‌దంతులు
-దానిపై స్ప‌దించిన టోలో న్యూస్ ఛానెల్ రిపోర్ట‌ర్
-తాను చ‌నిపోలేద‌ని ప్ర‌క‌ట‌న‌

-పాకిస్థాన్​ బార్డర్​ కు పోటెత్తిన ఆఫ్ఘన్లు..

-కాబూల్​ కన్నా దారుణ పరిస్థితుల్లో వేలాది మంది…
-స్పిన్ బోల్దక్ సరిహద్దు వద్ద ఆఫ్ఘన్ల ఎదురుచూపులు
-వీడియోను పోస్ట్ చేసిన ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్
-విదేశీ బలగాలు లేవు కాబట్టే మీడియా చూపించట్లేదని ఆవేదన

 

ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న నేప‌థ్యంలో ఆ దేశంలో అక్ర‌మాలు పెరిగిపోతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాలిబన్లు టోలో న్యూస్ జర్నలిస్టును హత్య చేశారని, ఈ మేర‌కు మీడియాకు సమాచారం అందిందంటూ వ‌దంతులు వ్యాపిస్తున్నాయి.

కాబూల్ విమానాశ్రయం ఎదుట ఈ హత్య జ‌రిగింద‌ని అస‌త్య‌ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ వ‌దంతుల‌పై స‌దరు జ‌ర్న‌లిస్ట్ స్పందించారు. త‌న‌ను తాలిబ‌న్లు తీవ్రంగా కొట్టార‌ని ఆయ‌న చెప్పారు. అంతేగానీ, తాను చ‌నిపోలేద‌ని వ్యాఖ్యానించారు. ప్రజాస‌మ‌స్య‌ల‌ను జ‌ర్న‌లిస్టు వివ‌రిస్తోన్న స‌మ‌యంలో ఆయ‌న‌ను తాలిబ‌న్లు కొట్టిన‌ట్లు తెలుస్తోంది. తాలిబ‌న్ల దాడిలో మ‌రికొంద‌రు జ‌ర్న‌లిస్టులూ గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం.

తాలిబన్ల రాజ్యం నుంచి తప్పించుకుని వెళ్లేందుకు ఉన్న అన్ని మార్గాలనూ ఆఫ్ఘనిస్థానీలు వెతుక్కుంటున్నారు. కాబూల్ విమానాశ్రయంలో ఏ విమానం దొరికితే ఆ విమానమెక్కి ఇప్పటికే చాలా మంది దేశం దాటేశారు. బతుకు మీద గంపెడాశతో దేశం దాటేందుకు ఇంకా చాలా మంది మూటాముల్లె సర్దుకుని బయల్దేరుతున్నారు. ఆ వలసలు ఒక్క కాబూల్ కే పరిమితం కాలేదు. వేరే ఇతర నగరాల్లోనూ జరుగుతున్నాయి.

పాకిస్థాన్ సరిహద్దులను వారు దాటే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ స్పిన్ బోల్దక్ బార్డర్ కు వేలాది మంది ఆఫ్ఘన్లు పోటెత్తారు. ఈ ప్రాంతంలో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయని చెబుతున్నారు. దానికి సంబంధించిన వీడియోను నతీఖ్ మాలిక్జాదా అనే ఫ్రీలాన్స్ జర్నలిస్టు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

‘‘ఇది కాబూల్ ఎయిర్ పోర్టు కాదు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి పాకిస్థాన్ లోకి ప్రవేశించేందుకు వేలాది మంది ఆఫ్ఘన్లు పోటెత్తిన స్పిన్ బోల్దక్ సరిహద్దు. కాబూల్ ఎయిర్ పోర్టు దగ్గరి పరిస్థితుల కన్నా ఇక్కడ ఇంకా దారుణమైన పరిస్థితులున్నాయి. అయితే, విదేశీ బలగాలేవీ ఇక్కడ లేకపోవడం వల్లే మీడియా ఎక్కువ కవరేజీ ఇవ్వడం లేదు’’ అని నతీఖ్ ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. ఒక్క పాకిస్థాన్ సరిహద్దుల వద్దే కాదు.. నలుమూలలా ఉన్న సరిహద్దులకు ఆఫ్ఘన్లు తరలిపోతున్నట్టు తెలుస్తోంది.

చెప్పాపెట్టకుండా కాబుల్ కు వెళ్లిన అమెరికా ఎంపీలు… ప్రభుత్వం, సైన్యం ఆగ్రహం
ముందస్తు సమాచారం ఇవ్వకుండా కాబూల్ వెళ్లిన ఎంపీలు
కొన్ని గంటల పాటు అక్కడే గడిపిన ఎంపీలు
వీరి పర్యటన వల్ల తరలింపు ప్రక్రియకు ఇబ్బందులు తలెత్తాయన్న సైన్యం

అమెరికాకు చెందిన ఇద్దరు చట్టసభ్యులు చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి తరలింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతున్న తరుణంలో వీరిద్దరూ కాబూల్ విమానాశ్రయాన్ని సందర్శించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా వీరిద్దరూ కాబూల్ కు వెళ్లడంపై అమెరికా విదేశాంగ శాఖ, సైన్యం ఆగ్రహం వ్యక్తం చేశాయి.

సెథ్ మౌల్టన్ (డెమోక్రాట్), పీటర్ మీయర్ (రిపబ్లికన్)లు ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరూ ప్రత్యేక విమానంలో మంగళవారం ఆకస్మికంగా కాబూల్ విమానాశ్రయానికి వెళ్లారు. విదేశీ పౌరులు, శరణార్థులను తరలిస్తున్న చర్యలను పరిశీలించారు. కొన్ని గంటల పాటు అక్కడ గడిపారు.

వీరిద్దరూ గతంలో సైన్యంలో పనిచేశారు. ప్రస్తుతం సాయుధ సేనల కమిటీలో మౌల్టన్, విదేశీ వ్యవహారాల కమిటీలో మీయర్ సభ్యులుగా ఉన్నారు. వీరి ప్రత్యేక విమానం కాబూల్ లోకి ప్రవేశించడానికి కొన్ని క్షణాల ముందే తమకు వారి పర్యటన గురించి సమాచారం అందిందని సైన్యం పేర్కొంది. ఈ పర్యటన వల్ల ఇతరుల తరలింపుకు ఇబ్బందులు తలెత్తాయని అన్నారు.

Related posts

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహం …

Ram Narayana

పవన్ డ్రామాలు సినిమాలో చేసుకో ప్రజలవద్ద కాదు ..పేర్నినాని ఫైర్ …

Drukpadam

బీఆర్ యస్ కు శ్రీహరి రావు బై బై …కాంగ్రెస్ కు జై జై …

Drukpadam

Leave a Comment