Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు

వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు
-కెసిఆర్ విస్తృత సమావేశం
-కాంగ్రెస్ ఖమ్మం సమావేశం -రేవంత్ రెడ్డి రైతు పాదయాత్ర
-బండి సంజయ్ గుర్రంపోడు సందర్శన
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకేరోజు టీఆర్ యస్ , కాంగ్రెస్, బీజేపీలు వేరువేరుగా కార్యక్రమాలు నిర్వయించాయి. కాంగ్రెస్ రెండు కార్యక్రమాలు నిర్వవించగా , బీజేపీ సూర్యాపేట జిల్లాలోని గుర్రంపోడు యాత్ర నిర్వయించింది . ఇది దండ యాత్రను తలపించింది. రేవంత్ రెడ్డి రైతు దీక్ష సైతం హైద్రాబాద్ కు పాదయాత్రగా మారింది . కేసీఆర్ పార్టీ విస్తృత సమావేశంలో సీఎం మార్పుపై క్లారిటీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హుజూర్ నగర్ ఎమ్మెల్యే గిరిజనుల భూములు కబ్జా చేశాడనే ఆరోపణలతో అక్కడకు చేరుకున్న బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా పొలంలోని టెంటు పై దాడిచేయడం వారిని పోలీసులు అడ్డగించటంతో ఉద్రిక్త చోటుచేసుకున్నది . పోలీసుల లాఠీచార్జి , నిరసన కారుల రాళ్లదాడితో అక్కడ రణరంగమైంది . నిరసన కారులతోపాటు పోలీసులకు గాయాలైయ్యాయి . అక్కడే బీజేపీ భహిరంగ సభ జరిగింది .నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద భూములు కోల్పున గిరిజనులకు అప్పటి ప్రభుత్వం గుర్రంపాడులో 1874 ఎకరాల భూములు ఇస్తే వాటిలో 500 భూములను ఎమ్మెల్యే సైదిరెడ్డి కాజేశాడని బీజేపీ నాయకులూ ఆరోపించారు. గిరిజనుల కోరిక మేరకు తమ పార్టీ గుర్రంపోడు పర్యటన చేపట్టిందని చెప్పారు. సభలో బండి సంజయ్ తో పాటు ,విజయశాంతి , ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ లు పాల్గొని ప్రసంగించారు. సీఎం మార్పు లేదంటూ కేసీఆర్ ప్రకటించడంపై కెసిఆర్ మోసపు మాటలను ఎవరు నమ్మవద్దని అన్నారు. ఆయన ఆరోగ్యం బాగున్నపుడు ఫామ్ హౌస్ లో ఎందుకు కూర్చుంటున్నారని ప్రశ్నించారు. పదేళ్లు తానే సీఎం అని పగటి కళలు కంటున్నారని విమర్శించారు. అరాచక అవినీతి పాలనా సాగుతుందని ధ్వజ మెత్తారు .
ఖమ్మం లో జరిగిన కాంగ్రెస్ సమావేశం కేసీఆర్ విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది . 2023 ఎక్కికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని అప్పుడు కేసీఆర్ ను జైల్లో పట్టడం ఖాయమై అన్నారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ . ఖమ్మం నుంచే కేసీఆర్ పతనం ప్రారంభం కావాలని ఇందుకు ఖమ్మం నాంది పలకాలన్నారు. భద్రాద్రి రాముడు సాక్షి గా పార్టీ నుంచి బయటకు వెళ్లినవారికి తిరిగి పార్టీలో స్తానం లేదన్నారు. ఖమ్మం లో భూతు కమిటీలను ఠాకూర్ అభినందించారు. ఖమ్మం ను ఆదర్శంగా తీసుకొని అన్ని జిల్లాలో భూతు కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ లో దోస్తీ రాష్ట్రంలో కుస్తీ పడుతున్నారని అన్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోయిన మాట్లాడలేని దద్దమ్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ధ్వజమెత్తారు.
ఖమ్మం ఎమ్మెల్యే జిల్లా మంత్రి అజయ్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. రేణుక చౌదరి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు.సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ , రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిలు బోసురాజు, శ్రీనివాసన్ , ఇతర నాయకులూ పాల్గొన్నారు.
మరో పక్క పార్టీ మరో వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నగర్ కర్నూల్ నుంచి రైతు దీక్షకు వెళ్లారు. అక్కడ రైతుల కోరిక మేరకు దీక్ష కాస్త హైద్రాబాద్ కు పాదయాత్రగా మారింది. ఈ పాదయాత్రకు ప్రజలు ప్రత్యేకించి రైతులు భ్రమ్మరథం పట్టారు. ఈ సందర్భగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ , వడ్లు కొనని కేసీఆర్ కు సీఎం పదవి ఎందుకని ప్రశ్నించారు. మాజీ ఎంపీ మల్లయు రవి మాట్లాడుతూ రేవంత్ కు టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అన్ని పార్టీలు యాత్రలు మీటింగులతో కాకా పుట్టిస్తున్నాయి. చిన్న ఎన్నికలను సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. దీనితో రాష్ట్రంలో యుద్దవాతావరణం నెలకొన్నది .
అంతకు ముందు రోజు ఢిల్లీలో జరుగుతున్నా రైతు దీక్షలకు మద్దతుగా వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో 3 గంటలపాటు జరిగిన రాస్తారోకో తో రహదార్లు అన్ని దిగ్బంధానికి గురైయ్యాయి . గంటలపాటు ట్రాఫిక్ స్తంభించి పోయింది .

Related posts

గతంలో నన్ను ‘చవట’ అన్నారు, ‘దద్దమ్మ’ అన్నారు… నేను పట్టించుకోలేదు: గెహ్లాట్ తో వివాదంపై సచిన్ పైలట్

Drukpadam

బీజేపీ కి చావుడప్పు కొట్టడంపై బండి సంజయ్ మండిపాటు1

Drukpadam

ఇప్పుడు నాలుగో రాజధాని కూడా వచ్చి చేరింది: పయ్యావుల కేశవ్!

Drukpadam

Leave a Comment