Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విశాఖ ఏపీ రాజధాని కాదు కాదు… పొరపాటు జరిగింది సరిదిద్దు కుంటున్నాం కేంద్రం!

విశాఖ ఏపీ రాజధాని కాదు కాదు… పొరపాటు జరిగింది సరిదిద్దు కుంటున్నాం కేంద్రం!
-హెడ్డింగ్ లో పొరపాటు జరిగింది.. విశాఖ రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వ వివరణ
-లోక్ సభలో ఓ ప్రశ్నకు బదులిచ్చిన కేంద్రం
-ఏపీ రాజధానిగా వైజాగ్ ను పేర్కొన్న వైనం
-పొరపాటు జరిగిందని కేంద్రం వివరణ

అసలే రాజధాని విషయంలో ఏపీ లో పెద్ద ఎత్తున అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధం జరుగుతున్నా వేళ కేంద్రం వైజాగ్ ఏపీ రాజధానిగా పేర్కొనడంపై పెద్ద వివాదమే తలెత్తింది. దీంతో తన తప్పును తెలుసుకున్న ఆకేంద్రం హెడ్డింగ్ లో పొరపాటు వల్లనే ఇది జరిగిందని జరిగిన పొరపాటుకు చింతుస్తున్నామని జరిగిన పొరపాటును సరిచేస్తున్నట్లు పేర్కొన్నది .

జగన్ సర్కార్ మూడు రాజధానుల ప్రస్తావన ఇప్పటికే కోర్ట్ లో నడుస్తుండగా దీనిపై ఉద్యమం కొనసాగుతున్నది. అధికార పార్టీ ప్రతిపాదనలను అంగీకరించనై రైతులు తెలుగు దేశం ఇతర ప్రతిపక్షాలతో కలిసి గత సంవత్సరకాలంగా దీక్షలు కొనసాగిస్తుంది. రాజధాని అమరావతి నుంచి తరలింపు వద్దని రాజధాని వస్తుందనే ఉద్దేశంతోనే భూములు ఇచ్చామని అందువల్ల ఇక్కడ వస్తుందనుకున్న రాజధాని మరోక్కడికో తరలి వెళ్ళటం సరికాదని ఆందోళనలు కొనసాగుతున్న వేళ కేంద్రం విశాఖ రాజధానిగా పేర్కొనడం మల్లి పొరపాటు జరిగిందని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తుంది.

ఈ నెల 26న లోక్ సభలో ఎంపీలు అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. ఏపీ రాజధాని విశాఖ అనే భావన వచ్చేలా ఆ సమాధానం ఉంది. దీనిపై దుమారం రేగడంతో కేంద్ర ప్రభుత్వం మళ్లీ క్లారిటీ ఇచ్చింది. ఏపీ రాజధాని వైజాగ్ అని చెప్పడం తమ ఉద్దేశం కాదని తెలిపింది. ఏపీలో విశాఖ ఒక నగరం మాత్రమేనని పేర్కొంది. పెట్రోలియం ట్యాక్స్ కు సంబంధించి మాత్రమే విశాఖ పేరును ఉదహరించామని తెలిపింది.

లిఖితపూర్వక సమాధానంలో టేబుల్ కు సంబంధించిన హెడ్డింగ్ లో పొరపాటు వల్లే ఈ సమస్య తలెత్తిందని కేంద్రం చెప్పింది. హెడ్డింగ్ లో క్యాపిటల్ తో పాటు, సమాచారం సేకరించిన నగరం పేరును కూడా చేర్చుతున్నామని తెలిపింది. దీనికి సంబంధించి ఇప్పటికే లోక్ సభ సచివాలయానికి సమాచారం కూడా ఇచ్చామని చెప్పింది. కేంద్రం ఇచ్చిన క్లారిటీతో వివాదం సద్దుమణిగింది.

Related posts

కాంగ్రెస్ తో కేసీఆర్ పొత్తు… మా హైకమాండ్ ఒప్పుకోలేదు: కోమటిరెడ్డి…

Drukpadam

అంబానీ నంబర్ 2.. అదానీ నంబర్ 1: ఫోర్బ్స్ తాజా లెక్కలు!

Drukpadam

మినిమమ్ బ్యాలెన్స్’ పేరుతో బ్యాంకుల వేల కోట్ల బాదుడు.. పార్లమెంటులో వెల్లడించిన కేంద్రం

Ram Narayana

Leave a Comment