Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

మర్యాదగా లొంగిపోండి… లేకపోతే చంపేస్తాం: తాలిబన్ల లేఖలు!

మర్యాదగా లొంగిపోండి… లేకపోతే చంపేస్తాం: తాలిబన్ల లేఖలు!
-అమెరికాకు సహకరించిన ప్రతి ఒక్కరూ లొంగిపోవాలంటూ లేఖలు
-బహిరంగ ప్రదేశాలతో పాటు చాలా ఇళ్లకు లేఖలు అంటించిన తాలిబన్లు
-లొంగిపోని వారికి మరణశిక్షను విధిస్తామని హెచ్చరిక

ఆప్ఘనిస్థాన్ నుంచి అమెరికా సేనలు సంపూర్ణంగా వైదొలగాయి. ఆ వెంటనే కాబూల్ ఎయిర్ పోర్టును కూడా తాలిబన్లు స్వాధీనపరుచుకున్నారు. అనంతరం తాలిబన్లు అసలైన పనిని ప్రారంభించారు. అమెరికా, బ్రిటన్ లతో పాటు వాటి మిత్ర బృందాలకు సహకరించిన వారిని నిర్మూలించే పనిలో పడ్డారు. వారికి సహకరించిన ప్రతి ఒక్కరూ మర్యాదగా లొంగిపోవాలని, లేకపోతే చంపేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ప్రతి ఇంటికి వెళ్లి చెప్పకుండా… బహిరంగ ప్రదేశాల్లో లేఖలను అంటించారు.

బహిరంగ ప్రదేశాలతో పాటు చాలా ఇళ్లకు ఈ లేఖలు అంటించారని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ తెలిపింది. అమెరికా, దాని మిత్ర దేశాలకు మద్దతు ఇచ్చిన వారు వెంటనే కోర్టు ముందు లొంగిపోవాలని… లేకపోతే మరణశిక్షను అమలు చేస్తామని లేఖలో తాలిబన్లు హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో 34 ఏళ్ల ఓ వ్యక్తి మాట్లాడుతూ, హెల్మాండ్ ప్రావిన్స్ లో బ్రిటన్ ఆర్మీ రోడ్లను నిర్మించిందని… ఈ సమయంలో తమ ప్రాంత అభివృద్ధి కోసం తాను సహాయం చేశానని తెలిపాడు. అయితే, తాను ఆ విషయాలను బయటకు చెప్పదలుచుకోలేదని… బయట కూడా ఇకపై పెద్దగా కనిపించకూడదని నిర్ణయించుకున్నానని చెప్పాడు. తనకు బతకాలని ఉందని అన్నాడు.

అమెరికా హెలికాప్టర్ లో తాలిబన్ల గగనవిహారం… హెలికాప్టర్ కు వేళ్లాడుతున్న వ్యక్తి దేహం!
ఆఫ్ఘన్ లోనే పలు అమెరికా హెలికాప్టర్లు
ఒకదాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు
వెలుగులోకి వచ్చిన వీడియో
కాందహార్ లో పహారా కాస్తున్నారన్న తాలిబ్ టైమ్స్
వ్యక్తిని ఉరితీశారన్న రిపబ్లికన్ సెనేటర్

రెండు దశాబ్దాల ప్రస్థానానికి ముగింపు పలుకుతూ అగ్రరాజ్యం అమెరికా కల్లోలభరిత ఆఫ్ఘనిస్థాన్ నుంచి పూర్తిగా వైదొలగింది. అయితే అమెరికాకు చెందిన పలు హెలికాప్టర్లు ఇప్పటికీ ఆఫ్ఘన్ లో కొన్ని మిగిలే ఉన్నాయి. తాజాగా, ఓ అమెరికా హెలికాప్టర్ లో తాలిబన్లు ప్రయాణిస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

ఆఫ్ఘనిస్థాన్ లోని కాందహార్ లో ఆ హెలికాప్టర్ ప్రయాణిస్తుండగా, ఆ హెలిక్టాపర్ కు ఓ మానవ దేహం వేళ్లాడుతుండడం వీడియోలో కనిపించింది. దీనిపై తాలిబన్లకు చెందిన ‘తాలిబ్ టైమ్స్’ ట్విట్టర్ లో స్పందించింది. “ఇది మా ఎయిర్ ఫోర్స్. ఇస్లామిక్ ఎమిరేట్స్ కు చెందిన వాయుసేన హెలికాప్టర్ కాందహార్ నగరంపై తిరుగుతూ పహారా కాస్తోంది” అని వివరించింది.

అయితే, అమెరికా చట్టసభ రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రజ్ దీనిపై తీవ్రస్థాయిలో స్పందించారు. “జో బైడెన్ ఆఫ్ఘనిస్థాన్ లో సృష్టించిన విపత్తును ఈ భయానక దృశ్యం సోదాహరణంగా వివరిస్తుంది. తాలిబన్లు ఓ వ్యక్తిని అమెరికా బ్లాక్ హాక్ హెలికాప్టర్ నుంచి ఉరితీశారు. విషాదకరం… ఊహించలేని ఘటన” అని టెడ్ క్రజ్ పేర్కొన్నారు.

Related posts

పంజాబ్ లో మరో ఘటన… నిషాన్ సాహిబ్ ను అపవిత్రం చేశాడంటూ వ్యక్తిని కొట్టి చంపిన గ్రామస్తులు!

Drukpadam

మహిళను చంపి వెళ్లి.. వెనక్కి వచ్చి మరో ఇద్దర్ని చంపాడు.. అమెరికాలో ఉన్మాది ఘాతుకం!

Drukpadam

ఎయిర్‌పోర్ట్ వెలుపల వేచిచూసి.. మాజీ భార్య ప్రియుడు బయటకు రాగానే..!

Ram Narayana

Leave a Comment