Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆఫ్ఘనిస్థాన్ లో కీలక పరిణామం… పంజ్ షీర్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు?

ఆఫ్ఘనిస్థాన్ లో కీలక పరిణామం… పంజ్ షీర్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు?
ఆఫ్ఘన్ లో తాలిబన్ల పాలన ప్రారంభం
అదే సమయంలో పంజ్ షీర్ పై పంజా!
పారిపోయిన అమృల్లా సలేహ్
మీడియాలో కథనాలు
కథనాలను కొట్టిపారేసిన పంజ్ షీర్ యోధులు

ఆఫ్ఘన్ స్థానాల్లో అన్ని ప్రాంతాలను తమ వశం చేసుకున్న తాలిబాన్లకు పంజ్ షీర్ అడ్డంకిగా ఉంది . అయితే తాజా సమాచారం ప్రకారం పంజ్ షీర్ ను కూడా తాలిబన్లు వశపరుచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనేక ఆదేశాలు తాలిబాన్లకు మద్దతు ప్రకటిస్తున్న నేపథ్యంలో పంజ్ షీర్ కూడా వారికీ లొంగి పోక తప్పదని అనుకున్నదే అయితే ఇంట తొందరగా లొంగక పోవచ్చునని వార్తలు వచ్చాయి. తాలిబన్ల ప్రచారం తప్పు అని తాము లొంగలేదని పంజ్ షీర్ వీరులు పేర్కొనటం గమనార్హం .

ఇన్నాళ్లు కొరకరానికొయ్యలా పరిణమించిన పంజ్ షీర్ ప్రాంతాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్ లో రాజధాని కాబూల్ సహా అత్యధిక భూభాగంపై పట్టు సాధించిన తాలిబన్లకు ఇన్నాళ్లు పంజ్ షీర్ సవాలుగా మారింది. అయితే, కొన్నిరోజులుగా అత్యధిక సంఖ్యలో బలగాలను తరలించిన తాలిబన్లు పంజ్ షీర్ ను కూడా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారని పాకిస్థాన్ స్ట్రాటజిక్ ఫోరం వెల్లడించింది.

ఆఫ్ఘనిస్థాన్ కు ఆపద్ధర్మ దేశాధ్యక్షుడిగా తనను తాను ప్రకటించుకున్న ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ పంజ్ షీర్ నుంచి తజకిస్థాన్ కు పారిపోయాడని, అతడి వెంట కొందరు పంజ్ షీర్ కమాండర్లు కూడా ఉన్నారని పాకిస్థాన్ స్ట్రాటజిక్ ఫోరం తెలిపింది. అయితే, తాము తాలిబన్లకు లొంగిపోయామన్న వార్తలను పంజ్ షీర్ యోధులు కొట్టిపారేస్తున్నారు. అవన్నీ అవాస్తవాలని, తాలిబన్లు ఆ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు.

Related posts

గుజరాత్‌లో కేజ్రీవాల్‌కు దక్కేవి రెండు సీట్లేనట: ఏబీపీ న్యూస్-సీఓటర్ సర్వే..తమదే గెలుపు అంటున్న కేజ్రీవాల్ …!

Drukpadam

సాగర్ ఎన్నిక మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకం

Drukpadam

నచ్చింది ధరించవచ్చు బట్ అన్ని చోట్ల కాదు …యోగి

Drukpadam

Leave a Comment