Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆఫ్ఘన్ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశం!

ఆఫ్ఘన్ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశం
-పాల్గొన్న హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
-జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా
-తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సమయంలో భేటీ

తాలిబన్ల హస్తగతమైన ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆఫ్ఘన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసే సన్నాహాల్లో తాలిబన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కీలక శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో మోదీ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ఏ విషయాలపై చర్చ జరిగిందీ మాత్రం తెలియరాలేదు. తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పౌరులపై ఆంక్షలు, విభేదించిన వారిపై కఠిన శిక్షలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ విషయంలో భారత్ అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాని మోదీ ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, ఇతర దేశాలతోపాటు భారత్‌తో కూడా తాము సత్సంబంధాలనే కోరుకుంటున్నట్లు ఇది వరకు తాలిబన్లు ప్రకటించారు. ఆ తర్వాత దోహాలోని రాయబార కార్యాలయంలో భారత రాయబారి దీపత్ మిట్టల్‌తో సమావేశమయ్యారు కూడా. ఆఫ్ఘన్ గడ్డ మీద నుంచి భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు జరగకుండా చూడాలని ఈ భేటీలో తాలిబన్లకు భారత్ స్పష్టంగా చెప్పింది.

Related posts

పసుపు పండుగ.. నేడు భారీ ర్యాలీతో ఒంగోలు చేరుకున్న చంద్రబాబు ..

Drukpadam

ఎంపీగానే కొనసాగాలని అఖిలేశ్ యాదవ్ అనూహ్య నిర్ణయం!

Drukpadam

ఆ విషయంలో కేసీఆర్ ను మించినవాళ్లు లేరు: రేవంత్ రెడ్డి

Drukpadam

Leave a Comment