Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

కరోనా కు హడలెత్తుతున్న అగ్రరాజ్యం అమెరికా!

కరోనా కు హడలెత్తుతున్న అగ్రరాజ్యం అమెరికా
-విమానంలో మాస్కు లేకపోతే డబుల్ ఫైన్.. అమెరికా ప్రభుత్వం నిర్ణయం
-మొదటిసారి అయితే 35 వేల నుంచి 70 వేలు
-రేడవసారి అయితే 70 వేల నుంచి 2 లక్షలు
-విమానంలో మాస్కు పెట్టుకోవాలని కోరితే సిబ్బందితో వాగ్వాదాలు
-పలు వీడియోలు నెట్టింట్లో వైరల్
-ఆగ్రహం వ్యక్తం చేసిన అధ్యక్షుడు బైడెన్

కరోనా కు అగ్రరాజ్యం హడలెత్తుతున్నది . ప్రపంచంలోనే అధికమరణాలు సంభవించిన దేశంగా రికార్డులలోకి వెక్కిన అమెరికా ,వ్యాక్సిన్ వచ్చిన తరువాత తగ్గుముఖుం పట్టింది. దీంతో కొంత సడలింపులు ఇచ్చారు. ఒకసందర్బాల్లో మాస్క్ లు పెట్టుకోవాల్సిన అవసరం లేదని కొన్ని రాష్ట్రాలలో ప్రకటించారు. హోటల్స్ , రెస్టారెంట్లు మాస్క్ లు అవసరం లేదని బోర్డులు పెట్టాయి. ప్రజలు బజార్లలోకి వచ్చారు. తిరిగి వైరస్ విజృభించింది. దీంతో అప్రమత్తమైన అమెరికా ప్రభుత్వం తిరిగి ఆంక్షలు విధించింది. చాల దేశాలు వ్యాక్సిన్ వేసుకొంటే క్వారంటైన్ అవసరంలేదని ప్రకటించాయి. అయితే ప్రజల్లో ఇంకా మార్పు రావాల్సి ఉందనే ఉద్దేశంతో తిరిగి ఆంక్షలకు సిద్ధమౌతున్నారు. అందులో భాగంగానే అమెరికా విమానంలో ప్రయాణించేవారు తప్పని సరిగా మాస్క్ పెట్టుకోవాలని లేకపోతె జరిమానా భారీ ఎత్తున ఉంటుందని ప్రకటించడం ఇంకా ఉన్న కార్న్ ఆప్రభావాన్ని తెలియజేస్తుంది.

ఇటీవలి కాలంలో అమెరికాలో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. వాటిలో కొందరు ప్రయాణికులు విమానాల్లో మాస్కులు పెట్టుకోలేదు. అది నిబంధనలకు విరుద్ధమని, మాస్కులు ధరించాలని కోరిన సిబ్బందితో వాగ్వాదాలకు దిగారు. ఇప్పటికే విమానాల్లో మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ అమెరికాలో చట్టాలు చేశారు.

తొలిసారి ఇలా మాస్కు లేకుండా కనిపిస్తే 250 డాలర్ల జరిమానా, మరోసారి దొరికితే 1500 డాలర్ల జరిమానా విధిస్తామని ప్రభుత్వం తెలిపింది. అయినా సరే మాస్కులు ధరించని కొందరు విమాన సిబ్బందితో గొడవలు పడుతున్నారు. దీనిపై అమెరికా ప్రభుత్వం సీరియస్ అయింది. ఇలాంటి వారికి విధించే జరిమానాను రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయం గురించి అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాట్లాడుతూ.. ‘‘వాళ్ల విధులు నిర్వర్తిస్తున్న విమాన సిబ్బందిపై ఈ ప్రయాణికులు చూపిస్తున్న ఆగ్రహం తప్పు. ఇది చాల ఛండాలంగా ఉంది’’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. విమాన సిబ్బందికి గౌరవం ఇవ్వాలని సూచించారు.

ఈ క్రమంలో ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (రవాణా భద్రతా విభాగం) ఒక ప్రకటన చేసింది. ఇకపై విమానాల్లో మాస్కు లేకుండా కనిపించే వారికి తొలిసారి అయితే 500 నుంచి 1000 డాలర్లు, మళ్లీ ఇలాగే కనిపిస్తే 1000 నుంచి 3000 డాలర్లు జరిమానా విధిస్తామని ప్రకటించింది.

Related posts

ట్రైనీ ఐఏఎస్ అధికారుల్లో .. 84 మందికి పాజిటివ్!

Drukpadam

కరోనాకు మరో కొత్త టీకా.. నాలుగు రోజుల్లో ఉత్పత్తి ప్రారంభిస్తామన్న గ్లాక్సో…

Drukpadam

రెండు వేరు వేరు వ్యాక్సిన్లు తీసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు: కేంద్రం!

Drukpadam

Leave a Comment