Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారమా… ఎంత దిగజారిపోయాం!: మహేశ్ బాబు ఆవేదన!

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారమా… ఎంత దిగజారిపోయాం!: మహేశ్ బాబు ఆవేదన!
సైదాబాద్ లో కామోన్మాది ఘాతుకం
ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
ప్రాణాలు కోల్పోయిన బాలిక
హృదయం భగ్గుమంటోందన్న మహేశ్ బాబు
చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్

ఆరేళ్ళ చిన్నారి పై జరిగిన అత్యాచారం ,హత్యపై టాలీవుడ్ కూడా స్పందించింది. హీరో మహేష్ బాబు , నాని ఈ విషాద సంఘటన తమను కలిచి వేసినదని వారు అన్నారు.నిజంగా మనం ఎక్కడ ఉన్నాం …ఎంత దిగజారిపోయాం అని ఈ సంఘటన రుజువు చేస్తుందని అన్నారు.

హైదరాబాదులో ఓ చిన్నారి అత్యాచారానికి గురై కన్నుమూసిన ఘటన పట్ల టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు చలించిపోయారు. సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన దారుణ అఘాయిత్యం మనం ఓ సమాజంగా ఏ స్థాయికి దిగజారిపోయామో చెప్పేందుకు నిదర్శనం వంటిదని వ్యాఖ్యానించారు.నిందిగుడు రాజు బయట ఎక్కడో ఉన్నాడు ఉండకూడదని హీరో నాని తన ట్విట్ లో పేర్కొన్నారు.

“మన పిల్లలు ఎప్పటికైనా భద్రంగా ఉంటారా? అనేది ఓ జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది. హృదయం భగ్గుమంటోంది… ఆ చిన్నారి కుటుంబం ఎంత క్షోభను అనుభవిస్తోందో ఊహించలేం” అని పేర్కొన్నారు. ఈ ఘటనపై సత్వరమే చర్యలు తీసుకుని ఆ చిన్నారికి, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలి అని మహేశ్ బాబు విజ్ఞప్తి చేశారు.

నిందితుడు రాజు ‘బ‌య‌టెక్కడో ఉన్నాడు.. ఉండ‌కూడ‌దు’ అంటూ హీరో నాని ట్వీట్..

హైద‌రాబాద్‌లోని సైదాబాద్‌, సింగ‌రేణి కాల‌నీలో తీవ్ర‌ క‌ల‌క‌లం రేపిన ఆరేళ్ల బాలిక హ‌త్యోదంతం నిందితుడు రాజు గురించి స‌మాచారం అందిస్తే రూ.10 లక్ష‌లు ఇస్తామ‌ని పోలీసులు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. సినీన‌టుడు నాని దీనిపై స్పందిస్తూ, పోలీసులు చేసిన ట్వీట్ ను ఆయ‌న రీట్వీట్ చేశాడు. ‘బయటెక్కడో ఉన్నాడు.. ఉండకూడదు’ అంటూ ఆయ‌న రాజును ఉద్దేశించి పేర్కొన్నాడు.

మ‌రోవైపు, బాలిక కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి సింగరేణి కాల‌నీకి జనసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ జూబ్లీహిల్స్ లోని త‌మ పార్టీ కార్యాలయం నుండి బయలుదేరనున్నారు. కాసేప‌ట్లో ఆయ‌న వారి ఇంటికి చేరుకోనున్నారు. అలాగే, ఈ రోజు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల కూడా బాలిక ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించ‌నున్నారు.

కాగా, బాలిక‌పై రాజు అత్యాచారానికి పాల్ప‌డి, ఆ త‌ర్వాత చంపేసి, అక్క‌డి నుంచి పారిపోయాడ‌ని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజును ఎన్‌కౌంట‌ర్ చేయాల‌ని, లేదంటే త‌మ‌కు అప్ప‌గించాల‌ని అత‌డి అంతుచూస్తామ‌ని అంటున్నారు.

 

హత్యాచార నిందితుడు రాజు ఆత్మ‌హ‌త్య‌పై మెగాస్టార్ చిరంజీవి స్పంద‌న‌

  • రాజు త‌న‌ను తాను శిక్షించుకున్నాడు
  • అంద‌రికీ ఊర‌ట క‌లిగిస్తోంది
  • మ‌రోసారి బాలిక‌ల‌పై దారుణాలు జ‌ర‌గకూడ‌దు
Lets not allow such dastardly acts to recur and lets do whatever it takes towards this goal says chiru

హైద‌రాబాద్‌లోని సైదాబాద్ బాలిక హ‌త్యాచార నిందితుడు రాజు రైల్వే ట్రాక్ పై ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై ప‌లువురు ప్ర‌ముఖులు స్పందిస్తున్నారు. ప్రముఖ సినీన‌టుడు చిరంజీవి తాజాగా రాజు ఆత్మ‌హ‌త్య‌పై స్పందిస్తూ… రాజు త‌న‌ను తాను శిక్షించుకోవ‌డం బాధిత బాలిక కుటుంబ స‌భ్యుల‌తో పాటు అంద‌రికీ ఊర‌ట క‌లిగిస్తోంద‌ని చెప్పారు. బాలిక‌ల‌పై దారుణ ఘ‌ట‌న‌లు మ‌రోసారి జ‌ర‌గ‌కూడ‌ద‌ని, అందుకు ప్ర‌జ‌లు చొర‌వ‌చూపాల‌ని ఆయ‌న కోరారు.

చిరంజీవి స్పంద‌న‌…

Related posts

బెంగళూరులో ఘోరం.. మహిళను 30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు!

Ram Narayana

విజయవాడ పోలీసులకు చిక్కిన నరహంతక ముఠా!

Drukpadam

వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడి మృతి.. హైదరాబాద్ లో దారుణం..!

Drukpadam

Leave a Comment