Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

యూట్యూబ్ ద్వారా నెల‌కు రూ.4 ల‌క్ష‌లు సంపాదిస్తోన్న కేంద్ర మంత్రి…

యూట్యూబ్ ద్వారా నెల‌కు రూ.4 ల‌క్ష‌లు సంపాదిస్తోన్న కేంద్ర మంత్రి…
-వివ‌రాలు తెలిపిన నితిన్ గ‌డ్క‌రీ
-కరోనా విజృంభ‌ణ స‌మ‌యంలో ఇంటికే పరిమితమ‌య్యాను
-ఆన్‌లైన్‌లో చాలా క్లాసులు తీసుకున్నాను
-వాటిని యూ ట్యూబ్‌లోనూ అప్‌లోడ్‌ చేశా

కేంద్ర మంత్రి కరోనా లో ఇంటివద్దనే ఎక్కువకాలం ఉన్న ఆయన ఖాళీగా కూర్చోలేదు …. ఖాళీ సమయంలో తన సతీమణికి సహాయంగా వంట చేశారు ….అంతేకాదు తన ఉపన్యాసాలను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. దీంతో కేంద్రమంత్రి ఉపన్యాసాలకు విఫరీతమనిన వ్యూహార్స్ ఉండటంతో ఆయనకు నెలకు 4 లక్షల రూపాయల సంపాదన లభించింది .ఈవిషయాన్ని మంత్రిగారే స్వయంగా వెల్లడించారు. ఆ మంత్రి ఎవరో కాదు కేంద్ర రహదారుల శాఖామంత్రి నితిన్ గడ్కరీ ….ఆయన తన ఉపన్యాసాల ద్వారా సంపాదించటం సంతోషంగా ఉందని ఆయన వెల్లడించారు. కరోనా ఈ విధంగా తనలో ఉన్న ప్రతిభను మరోసారి బయటకు వెల్లడించినట్లు అయిందని గడ్కరీ అన్నారు …..

యూట్యూబ్‌ ద్వారా నెలకు రూ.4 ల‌క్ష‌లు సంపాదిస్తున్నారు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. తాజాగా, హ‌ర్యానాలో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గ‌డ్క‌రీ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ… కరోనా విజృంభ‌ణ స‌మ‌యంలో తాను ఇంటికే పరిమితమై రెండు పనులు చేశాన‌ని అన్నారు.

ఒకటి ఇంట్లో వంట చేయడం కాగా, ఇంకోటి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉపన్యాసాలు ఇవ్వడం అని ఆయ‌న చెప్పారు. తాను ఆన్‌లైన్‌లో చాలా క్లాసులు తీసుకున్నానని, వాటిని యూ ట్యూబ్‌లోనూ అప్‌లోడ్‌ చేశాని వివ‌రించారు. దీంతో వాటికి వ్యూస్ బాగా వ‌చ్చాయ‌ని, యూట్యూబ్ త‌న‌కు నెలకు నాలుగు లక్షలు చెల్లిస్తోందని తెలిపారు.

తాను త‌న బాధ్య‌త‌ల నిర్వ‌హ‌ణ‌లో రాజీ ప‌డ‌బోన‌ని ఆయ‌న అన్నారు. త‌న‌ పెళ్లైన కొత్తలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌ను గుర్తు చేసుకున్నారు. త‌న‌కు పిల్ల‌నిచ్చిన మామ రోడ్డు మధ్యలో ఇంటిని క‌ట్టుకున్నార‌ని, దీంతో దాన్ని కూల్చేయాలని ఆదేశాలు జారీ చేశానని గ‌డ్క‌రీ చెప్పారు. ఈ చ‌ర్య‌లు తన భార్య కాంచనకు తెలియకుండా తీసుకున్నాన‌ని అన్నారు.

Related posts

జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. బాపట్ల జవాను జశ్వంత్‌రెడ్డి వీరమరణం!

Drukpadam

హిందువులకు అరుదైన గౌరవం.. అమెరికాలోనూ దీపావళి సెలవు!

Drukpadam

 ఒక్కో వాచీ ఖరీదు రూ. 2 కోట్లు.. గిఫ్ట్‌గా ఇచ్చిన అనంత్ అంబానీ..

Ram Narayana

Leave a Comment