Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

చిన్నమ్మ బెంగుళూరు టూ చెన్నై ఖర్చు 200 కోట్లు

చిన్నమ్మ బెంగుళూరు టూ చెన్నై ఖర్చు 200 కోట్లు
-అంటే గంటకు అక్షరాలా 8 కోట్ల 60 లక్షలు
-నిఘావర్గాల ఆరా… ?
బెంగుళూరు నుంచి చెన్నై రోడ్ మార్గం ద్వారా ప్రయాణ దూరం 334 కి.మీలు ప్రయాణ సమయం 6 .30 గంటలు కానీ చిన్నమ్మ అదేనండి జయలలిత నెచ్చెలి శశికళ కు పట్టిన సమయం 23 గంటలు. బెంగుళూరు జైలు నుంచి బయటికి వచ్చినతరువాత కొద్దిరోజులు బెంగుళూరు లోని హాస్పటల్ లో చికిత్స పొంది …. అనంతరం చెన్నై రావడానికి అయిన ఖర్షు అక్షరాలా 200 కోట్ల రూపాయలు …. వామ్మో ఇది నిజామా అనుకుంటున్నారా …. పచ్చి నిజం అని అంటున్నాయి ఇంటలిజెన్స్ వర్గాలు . దీనిపై దేశవ్యాపితంగా పెద్ద చేర్చే జరుగుతుంది. రాజకీవర్గాలు సైతం ఉలిక్కి పడుతున్నాయి. ఒక్క రోజులో ఇంత ఖర్చా అంటున్నారు. ఎందుకు ఇంత ఖర్చు పెట్టారని ఆరా తీస్తే , ఇంకా తక్కువగానే పెట్టారు . హెలికాప్టర్ ద్వారా పూలు కురిపించాలని ముచ్చట పడ్డారట మేనల్లుడు దినకరన్ . కానీ అందుకు పర్మిషన్ రాలేదని అంటున్నారు. ఆమె తనకు వెన్నుపోటు పొడిచిన నేతలపైనా మంచి కసిగా ఉన్నారు. ప్రతీకారం తీసుకోవాలనే కక్ష ఆమెలో కనిపిస్తుందని అంటున్నారు పరిశీలకులు . ఆమె వెంట కాన్యాయ్ లో 2 వేల కార్లు పాల్గొన్నట్లు అంచనా . చివరివరకు 4 వేల మంది పాల్గొన్నారు. దీని కేంద్ర నిఘావర్గాలు సైతం ఆరా తీస్తున్నట్లు టాక్ . దీని పై చర్యలు తీసుకోవాలని భావించినప్పటికీ ఆమెకి సింపతీ వస్తుందే ఉద్దేశంతో వెనకడుగు వేసినట్లు తెలుస్తుంది. అన్న డీఎంకే మాత్రం ఆమె కార్యకపాలను జాగ్రత్తగా గమనిస్తుంది.

Related posts

‘మంగళవారం మరదలు’ వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి వివరణ…

Drukpadam

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి అరెస్ట్!

Drukpadam

మాయల పకీరు మాటలు నమ్మొదు…పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Ram Narayana

Leave a Comment