సవాళ్ల పర్వం … మనిద్దరం తేల్చుకుందాం రా ! అచ్చన్న కు బొత్స సవాల్!
అందరం ఎందుకు… నువ్వూ, నేనూ రాజీనామా చేద్దాం రెడీనా
ప్రభుత్వాన్ని రద్దు చేయాలని అచ్చెన్న డిమాండ్
మళ్లీ ఎన్నికలకు పోదామని వ్యాఖ్యలు
అచ్చెన్న వ్యాఖ్యలను ఖండించిన బొత్స
ఇవేమన్నా కుస్తీ పోటీలా? అంటూ విమర్శలు
ఆంధ్రప్రదేశ్ లో నిన్న పరిషత్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. …. ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల ఫలితాలు దాదాపు 5 నెలల తరువాత హైకోర్టు కౌంటింగ్ కు అనుమతి నిచ్చింది. ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం అన్ని జిల్లాపరిషత్ లను అఖండ మైజార్టీ తో గెలుచుకుంది . పార్టీ సింబల్ పై జరిగిన ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీచేయాల వద్దా ? అనే మీమాంశ లో చివరకు పోటీచేసేందుకు అంగీకరించి తమ పార్టీ అభ్యర్థులకు బి ఫారాలు సైతం అందజేసింది. అయితే … తమకు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గా ప్రకటించింది. అప్పట్లో ఒక పక్క ఎన్నికల అధికారి నిమ్మగడ్డ ప్రసాద్ ,మరో పక్క కోర్టులలో కేసులు ఎన్నికల కమిషన్ నియామకంపై వివాదం, కరోనా మహమ్మారి భయం ఇలా అనేక రకాలుగా వచ్చిన విమర్శలు , వివాదాలు , తట్టుకొని ఎట్టకేలకు జరిగిన ఎన్నికలపై ప్రజావ్యాజ్యా పిటిషన్ వేయడంతో ఎన్నికలు అసలు జరపొద్దని సింగల్ బెంచ్ తీర్పు ఇవ్వగా , ఎన్నికలు జరుపుకోవచ్చునని డివిజన్ బెంచ్ తీర్పు నిచ్చింది.చివరకు ఎన్నికలు జరిగిన కౌంటింగ్ జరగకుండ మరో కోర్ట్ తీర్పు … దీంతో 5 నెలల క్రితం జరిగిన ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడ్డాయి. అందులో అధికార పార్టీ హవా కొనసాగింది.
తెలుగు దేశం అనిచ్చితి వల్ల భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు . చివరకు చంద్రబాబు సొంత నియాజకవర్గం కుప్పం లో సైతం అన్ని జడ్పీటీసీలను మొదటిసారిగా తెలుగుదేశం ఓడిపోయింది . ఇది ఒక రకంగా తెలుగు దేశం చేసిన రాజకీయతప్పిదానం అనక తప్పదు .
జడ్పీటీసీలలో 90 శాతం పైగా సీట్లను , ఎంపీటీసీలలో 80 శాతం పైగా సీట్లను వైకాపా గెలుచుకుంది. జనసేన ,బీజేపీ సిపిఎం ,సిపిఐ లు కూడా ఎంపీటీసీలలో బోణి కొట్టాయి.
ఈ ఎన్నికలపై టీడీపీ ,వైకాపాలమధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో వాతారణం వేడెక్కింది. ఈఎన్నికలను తాము బహిష్కరించామని అందువల్ల ఇవి ఎన్నికలే కావని టీడీపీ పేర్కొంటుంది . దమ్ముంటే శాసనసభను రద్దు చేసి ఎన్నికలు పెడితే ఎవరి సత్తా ఏమిటో చూపిస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు సవాల్ విసిరారు . దానికి ప్రతిగా రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్రం దాక ఎందుకు దమ్ముంటే నివ్వు నేను తేల్చుకుందాం రాజీనామా చేసి రా అంటూ సవాల్ విసిరారు. అందుకు రెడీనా అంటు అచ్చన్న కు కౌంటర్ ఇచ్చారు .
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. అచ్చెన్నాయుడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే, తాను కూడా రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో పోటీ చేసి ఎవరేంటో తేల్చుకుందామని అన్నారు. ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ అదేపనిగా డిమాండ్ చేయడం సరికాదని హితవు పలికారు.
“అందరూ రాజీనామా చేయడం ఎందుకు? నువ్వు, నేను రాజీనామా చేద్దాం రా. నాకు ఈ సవాళ్లు నచ్చవు. దమ్ముంటే చూసుకుందాం రా, దమ్ముంటే కొట్టుకుందాం రా అనడానికి ఇవేమన్నా కుస్తీ పోటీలా?” అని వ్యాఖ్యానించారు. ఎన్నికల బహిష్కరణ అంటూ అచ్చెన్నాయుడు చేస్తున్న వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.
ముందు, ఓటమిని అంగీకరించడం టీడీపీ నేర్చుకోవాలని సూచించారు. టీడీపీ నేతల మాటలు చూస్తుంటే వారికి ఓటమిని అంగీకరించే ధైర్యం లేదన్న విషయం అర్థమవుతోందని బొత్స విమర్శించారు. టీడీపీ పనైపోయిందన్న సంగతి స్పష్టమైందని, ఏపీ ప్రజలు సంక్షేమానికి పట్టం కట్టారని పేర్కొన్నారు.