Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీ లో జడ్పీ చైర్మన్లు ఫైనల్ …సీఎం జగన్ మార్క్ ఎంపిక!

ఏపీ లో జడ్పీ చైర్మన్లు ఫైనల్ …సీఎం జగన్ మార్క్ ఎంపిక!
సామజిక సమీకరణలే కొలమానంగా …చైర్మన్ల
-పార్టీ కార్యక్రమాలలో చురుక్కా పాల్గొన్నవారికి అవకాశం
-వివాదాలకు తావులేకుండా ఎంపిక
-అందరితో సంప్రదించిన తరవాతనే
-ఎంపీపీ ల విషయంలో అవే గైడ్ లైన్స్

ఏపీ లో జడ్పీటీసీ ,ఎంపీటీసీ ఎన్నికలు ముగిశాయి. అన్ని జడ్పీలు మండలాల్లో వైకాపా జెండా ఎగరబోతుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అన్ని జిల్లాలో ఒకే పార్టీ జడ్పీ చైర్మన్లు ఎంపిక కాబోతున్నారు. జగన్ మార్క్ ఎంపిక జరిగిందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఈ నెల 24 మండల పరిషత్ అధ్యక్షులను , 25 జిల్లాపరిషత్ చైర్మన్లను ఎన్నుకుంటారు . ఇందుకు గాను ఎన్నికల సంఘం నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది.

ముందుగానే రిజర్వేషన్ల ఆధారంగా ఎవరికి జెడ్పీ పీఠం అప్పగించాల నే దాని పైన సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు..పార్టీ సమన్వయకర్తలకు ఇప్పటికే సీఎం దిశా నిర్దేశం చేసారు. ఎంపిక చేసుకున్న 13 మంది అభ్యర్దులు తాజా ఫలితాల్లో విజయం సాధించారు. దీంతో వారి ఎంపిక మరింత సులువుగా మారింది. శ్రీకాకుళం జిల్లా నుంచి కవిటి నుంచి గెలిచిన పిరియా విజయ పేరు ఖరారైంది. అదే విధంగా విజయనగరం జిల్లా జెడ్పీ ఛైర్మన్ గా మెరకముడిదాం నుంచి గెలిచిన మజ్జి శ్రీనివాస రావు పేరు ఖరారు చేసారు. విశాఖకు గూడెం కొత్త వీధి నుంచి గెలుపొందిన కీముడు శివరత్నం ఎంపిక దాదాపు పూర్తయింది. తూర్పు గోదావరి జెడ్పీ ఛైర్మన్ గా పి గన్నవరం నుంచి గెలిచిన విప్పర్తి వేణు గోపాల రావు బాధ్యతలు స్వీకరించటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

పశ్చిమ గోదావరి జెడ్పీ ఛైర్మన్ గా యలమంచిలి నుంచి గెలిచిన కవురు శ్రీనివాస పేరు ఖరారైంది. క్రిష్ణా జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ గా గుడ్ల వల్లేరు నుంచి గెలుపొందిన ఉప్పాళ్ల హారిక పేరు ఖరారు చేసారు. గుంటూరు జిల్లా నుంచి కొల్లపర నుంచి గెలుపొందిన కత్తెర హెనీ క్రిస్టినా పేరు దాదాపు ఖరారు అయింది. ఇక, ప్రకాశం జిల్లా నుంచి దర్శి నుంచి గెలుపొందిన బూచేపల్లి వెంకాయమ్మ కొత్త జెడ్పీ ఛైర్ పర్సన్ గా ఎన్నిక కానున్నారు. నెల్లూరు నుంచి నెల్లూరు రూరల్ నుంచి గెలిచిన ఆనం అరుణ పేరు ఎంపిక చేసారు.

కర్నూలు జిల్లా జెడ్పీ ఛైర్మన్ గా సంజామల నుంచి గెలిచిన మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి పేరుకు సీఎం ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. అనంతపురం నుంచి ఆత్మకూరు నుంచి గెలుపొందిన గిరిజ పేరు ఖరారైంది,. అదే విధంగా సీఎం సొంత జిల్లా కడప నుంచి ఒంటిమిట్ట నుంచి గెలిచిన మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాధరెడ్డి పేరుకు సీఎం ఆమోదముద్ర వేసారు. చిత్తూరు జిల్లా నుంచి వి కోట నుంచి గెలిచిన శ్రీనివాసులు పేరు దాదాపుగా ఖరారు చేసారు. వీరంతా 25 న జెడ్పీ ఛైర్మన్లుగా ఎన్నిక కావటం దాదాపు లాంఛనంగానే కనిపిస్తోంది.

అదే విధంగా ఎంపీపీ ఎంపిక విషయంలోనూ పార్టీ పరంగా ఇప్పటికే మార్గదర్శకం చేసారు. సామాజిక సమీకరణాల ఆధారంగా ..స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేయనున్నారు. ఈ మొత్తం ఎన్నిక ప్రక్రియలో ఎక్కడా ఎటువంటి వివాదాలకు అవకాశం లేకుండా జరగాలని నిర్దేశించారు. మున్సిపల్ ఛైర్మన్లు..మేయర్ల విషయంలో జరిగిన విధంగానే పార్టీ నిర్ణయం మేరకు ఎంపిక విధానం ఉండాలని సీఎం స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.

Related posts

జగన్ ది హిట్లర్ గిరి…స్థానికసంస్థల ఎన్నికల్లో వైకాపా చర్యలపై లోకేష్ మండిపాటు!

Drukpadam

హైకోర్టును క‌ర్నూలుకు త‌ర‌లించే ప్ర‌తిపాద‌న ఉంది: కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు

Drukpadam

అసదుద్దీన్ ఒవైసీకి ‘జెడ్’ కేటగిరీ భద్రత.. కేంద్రం నిర్ణయం !

Drukpadam

Leave a Comment