ఆంధ్రప్రదేశ్

ఏకంగా 70 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణించిన కిషన్ రెడ్డి…

కంగా 70 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణించిన కిషన్ రెడ్డి…
  • -అరుణాచల్ ప్రదేశ్ లో కిషన్ రెడ్డి పర్యటన
  • -పరశురామ్ కుంద్ నుంచి మరువా వరకు ప్రయాణం
  • -స్వయంగా బైక్ నడిపిన వైనం
  • -అరుణాచల్ ప్రదేశ్ ను అభివృద్ధి చేస్తానని హామీ

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సుమారు 70 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణించారు. కిషన్ రెడ్డి స్వయంగా ద్విచక్రవాహనాన్ని నడపడం విశేషం. పరశురామ్ కుంద్ నుంచి మరువా వరకు ఆయన బైక్ పై ప్రయాణించారు. ప్రకృతి అందాలతో అలరారే దట్టమైన అటవీప్రాంతం గుండా కిషన్ రెడ్డి ప్రయాణం సాగింది.

అందమైన లోయలు, ఆకట్టుకునే పర్వత శ్రేణులతో కూడిన అరుణాచల్ ప్రదేశ్ ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కిషన్ రెడ్డి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిగానూ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Related posts

అమెరికాలో అంతర్యుద్ధం తప్పదు..రష్యా మాజీ అధ్యక్షుడి జోస్యం…

Drukpadam

హైదరాబాద్ లో అగ్ని ప్రమాదానికి గురైన కారు

Ram Narayana

జియో వర్కర్ల ముసుగులో మావోయిస్టులు.. ఏలూరులో అద్దె ఇంటి గుట్టురట్టు!

Ram Narayana