Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీఆర్ యస్ లో ఎన్నికల హడావుడి …జిల్లా పార్టీ నిర్మాణం లో మంత్రులే కీలకం !

టీఆర్ యస్ లో ఎన్నికల హడావుడి …జిల్లాల పార్టీ నిర్మాణం లో మంత్రులదే కీలకం!
-ఖమ్మం జిల్లాలో మంత్రి అజయ్ సూచించిన వ్యక్తికే అధ్యక్ష పదవి
-మిగతా నాయకులూ ఎవరు ఆశక్తి చూపని వైనం
-మండల అధ్యక్షుల ఎంపికలో ఎమ్మెల్యేలదే కీలకపాత్ర
-మండలంలో వారు చెప్పినవారికే అధ్యక్ష పదవులు
-అధ్యక్ష ఎన్నిక విషయం లో సీనియర్ల మౌనం

టీఆర్ యస్ లో జిల్లాల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. అందులో భాగంగానే జిల్లా కమిటీలను నియమిస్తున్నారు. ఇంతకుముందు జిల్లా కమిటీల ఊసెత్తని టీఆర్ యస్ నేడు జిల్లాలలో పార్టీ నిర్మాణంపై ద్రుష్టి సారించింది. రాష్ట్రంలో పార్టీకి కేసీఆర్ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు. వర్కింగ్ ప్రసిడెంట్ గా ఆయన కుమారుడు ,మంత్రి కేటీఆర్ ఉన్నారు. ఇప్పటివరకు టీఆర్ యస్ కు జిల్లా కమిటీలు లేవు . మండలాల్లో అధ్యక్షులను నియమిస్తుంటారు. గత రెండు సంవత్సరాలుగా పార్టీ సమభ్యత్వాల చేర్పింపుపై శ్రద్ద పెట్టారు. లక్షల్లో సభ్యులు చేరారు. ఇంతవరకు బాగానే ఉంది. కాని ఏ జిల్లాల్లోనూ కమిటీలు లేవు . నిర్మాణం అసలే లేదు. ఉద్యమ సమయంలో టీఆర్ యస్ నిర్మాణం చాల బాగావుంది. ఏ కార్యక్రమమైనా జిల్లా కమిటీల ద్వారా చేసే వారు. జిల్లాలకు మెసేజ్ లు వెళ్ళేవి .రాష్ట్రం నుంచి వచ్చిన ఆదేశాల కనుగుణంగా అనేక కార్యక్రమాలు ఉద్యమాలు నడిపిన చరిత్ర టీఆర్ యస్ కు ఉంది. ఉద్యమకారులు లాఠీదెబ్బలు తిన్నారు, అవమానాలు భరించారు, జైళ్లకు వెళ్లారు, ఒక రకంగా చెప్పాలంటే కుటుంబాలకు దూరంగా అనేక ఇబ్బందులు పడ్డారు.

అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లా కమిటీలు లేకుండానే కార్యక్రమాలు నడిచాయి. మండల కమిటీలు , జాగర కమిటీలు మాత్రమే ఉండేవి . ఇది చేయాలన్న నియోజకవర్గం లో ఉన్న ఎమ్మెల్యేలు,భాద్యులు రాష్ట్ర పార్టీ ఆదేశాలు అమలు చేసేవారు . అధికారం లో ఉన్న టీఆర్ యస్ జిల్లా కమిటీలు లేకపోవడంతో ఆ జిల్లా కు చెందిన మంత్రి లేదా ఇంచార్జి మంత్రి జిల్లాలపై అజమాయిషీ చేసేవారు . కాని తరువాత కాలంలో జిల్లాల్లో నిర్మాణం లేకపోవడాన్ని గుర్తించిన కేసీఆర్ ,జిల్లా కమిటీల ను నియమించడం ద్వారా పార్టీ లో ఉన్న క్యాడర్ ను ఉత్సాహపరిచి వారిద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తే ముందుముందు జిల్లాలలో తగినంత క్యాడర్ ఉంటుందని భావించారు. అందువల్ల జిల్లా కమిటీల ఏర్పాటు పై ద్రుష్టి పెట్టారు.

రాష్ట్రం లో ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్నాయి. అందువల్ల 33 జిల్లాలకు అధ్యక్షులు , ప్రధాన కార్యదర్శి లేదా కార్యదర్శిని రాష్ట్ర పార్టీ ఎంపిక చేస్తుంది. అంటే టీఆర్ యస్ పార్టీకి పెద్ద సైన్యమే ఏర్పడబోతోంది. ఖమ్మం జిల్లాలో మంత్రి అజయ్ ఎవరు పేరు చెపితే వారే అధ్యక్షులు . మిగతా నాయకులు జిల్లా కమిటీ ఎంపికలో పెద్దగా పట్టు పట్టడంలేదు.

మాజీ మంత్రి తుమ్మల ,మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు ప్రజల్లో పట్టుకోసం జిల్లాలో ఏ చిన్న అవకాశం దొరికినా, ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. అయితే వారు ఫలానా వారే అధ్యక్షులు గా ఉండాలనే పట్టుదలతో లేరు. మిగతా ఎమ్మెల్యే లు సైతం మానియోజకవర్గానికి ఫలానా పోస్ట్ కావాల్సిందే అని అడగటంలేదు. జిల్లాలో బలమైన పార్టీ గా ఉన్న టీఆర్ యస్ లో కొంత స్తబ్దత నెలకొన్నదనే అభిప్రాయాలూ ఉన్నాయి. ఎంపీ నామ జిల్లాలో పెద్దగా వేలు పెట్టడంలేదు. పిలిస్తే కార్యక్రమాలలో పాల్గొనడం లేకపోతె మనకెందుకు లే అని అభిప్రాయంతో ఉన్నారు. అయితే పార్లమెంట్ లో టీఆర్ యస్ వానిని చాల బలంగా వినిపిస్తున్నారు. కేసీఆర్ దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. మాజీమంత్రి తుమ్మల ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తనపై వస్తున్నా పుకార్లను కొట్టిపారేస్తే జిల్లాలో తన అనుయాయులకు అండగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. శభకార్యాలు , భాదల్లో ఉన్న కుటుంబాలను పరామర్శిస్తూ పర్యటనలు సాగిస్తున్నారు. ఇక మాజీ ఎంపీ పొంగులేటి ఎంపీ గా ఉన్నప్పుడు ఎలా తిరిగారో ఇప్పుడు కూడా అలాగే ఉమ్మడి జిల్లాలో పర్యటనలు చేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ నేనున్నాననీ భరోసా కల్పిస్తున్నారు. .

ఒక్క ఖమ్మం జిల్లాలోనే కాకుండా వివిధ జిల్లాలలో మంత్రులే పార్టీని నడిపిస్తున్నారు. వారు చెప్పిందే పార్టీ నిర్ణయంగా ఉంటుంది. అందువల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి అజయ్ ఎవరికీ చెపితే వారికే జిల్లా అధ్యక్షుడు , కార్యదర్శి పదవి లభిస్తుంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కు జిల్లా పార్టీ కార్యాలయ ఇంఛార్జిగా ఆర్జేసీ కృష్ణ వ్యవహరిస్తున్నారు. బహుశా ఆయన్నే జిల్లా అధ్యక్షుడిగా చేసే అవకాశాలు ఉన్నాయి . ఒకవేళ కృష్ణ కాని పక్షంలో మంత్రి ఎవరిని ఆప్ట్ చేసుకుంటారనేది చూడాలి మరి !

Related posts

కర్నూల్ కు న్యాయరాజధాని ….? మంత్రి సురేష్ మాటల్లోనే

Drukpadam

టీడీపీ కార్యాలయాలపై దాడులను ఖండించిన పవన్ కల్యాణ్, రఘురామకృష్ణ రాజు!

Drukpadam

పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లకు వ్య‌తిరేకంగా  తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నిర‌స‌న‌లు …

Drukpadam

Leave a Comment