Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఖైదీలకు కరోనా సోకడంతో జైలు లాక్‌డౌన్…జైలు నుంచి ఖైదీల తరలింపు!

ఖైదీలకు కరోనా సోకడంతో జైలు లాక్‌డౌన్…జైలు నుంచి ఖైదీల తరలింపు!
-ముంబైలోని బైకుల్లా జైల్లో 39 మంది ఖైదీలకు కరోనా
-ఇటీవల వచ్చిన ఖైదీకి కరోనా సోకి ఉండొచ్చని అనుమానం
-స్థానిక మున్సిపల్ స్కూల్లో ఖైదీల క్వారంటైన్‌

జైల్లోని ఖైదీలకు కరోనా సోకడంతో జైలును లాక్‌డౌన్ చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో వెలుగు చూసింది. ఇక్కడి బైకుల్లా జైల్లో 39 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ అని తేలినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన అధికారులు జైలును లాక్‌డౌన్ చేశారు.

ఇటీవల జైలుకు వచ్చిన ఖైదీల్లో ఎవరికైనా కరోనా సోకి ఉండొచ్చని, వారి వల్లే మిగతా వారికి ఈ వైరస్ సోకి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. కరోనా కలకలం కారణంగా అధికారులతోసహా ఖైదీలు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి జైల్లోని ఖైదీలను స్థానికంగా ఉన్న మున్సిపల్ స్కూల్లో క్వారంటైన్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

మజగావ్ ఏరియాలోని స్కూల్లో తాత్కాలిక క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జైల్లో ఖైదీలకు కరోనా సోకడంతో బైకుల్లా జైలును సీల్ చేస్తున్నట్లు బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రకటించింది.

Related posts

ధైర్యానికి ప్రతిరూపంలా కనిపించిన ఆ అమ్మాయిని కరోనా కబళించింది!

Drukpadam

జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి, బల్కంపేట ఎల్లమ్మ ఆలయాల మూసివేత

Drukpadam

చైనాలోని వుహాన్ లో మళ్లీ కరోనా కలకలం!

Drukpadam

Leave a Comment