Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

కేటీఆర్,సంతోష్ లకు కరోనా

కేసీఆర్ ఇంట్లో కేటీఆర్ ,సంతోష్ లకు పాజిటివ్
-హోమ్ ఐసోలేషన్ నేతలు
-పరిపాలనపై ప్రభావం
-త్వరగా కోలీవలని ప్రార్థనలు
-మున్సిపల్ ఎన్నికలు జరపటంపై విమర్శలు

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో వారంతా ఐసోలేషన్ లోకి వెళ్లారు .కేసీఆర్ గత వారంరోజులుగా ఫామ్ హౌస్ లోనే చికిత్స తీసుకొంటుండగా రెండురోజుల క్రితం యశోద హాస్పటల్ కు వచ్చి టెస్టుల చేయించుకున్నారు.అంతకు ముందే కవిత కూడా కొన్ని రోజులు ఐసోలేషన్ లో ఉన్నారు.ఫామ్ హౌస్ లో ఉన్న తండ్రి కేసీఆర్ ను ఇరువురు పరామర్శించారు. నిత్యం కేసీఆర్ మంచి చెడ్డలు చూసే రాజ్యసభ సభ్యులు సంతోష్ కు కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది.వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ప్రజలతో నిత్యసంబందాలు ఉండటంతో కరోనా భారిన పడక తప్పలేదు .కేటీఆర్ తనకు పాజిటివ్ వచ్చిన విషయాన్నీ ట్వీట్టర్ ద్వారా తెలిపారు .గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరు పరీక్షలు చేయించుకోవాలని కోరారు . సంతోష్ కూడా ఇదే విషయాన్నీ చెప్పారు .

మంత్రి కేటీఆర్ కు, ఎంపీ సంతోష్ కు కరోనా రావడం తో ..సీఎం కేసీఆర్ ఫ్యామిలిలో మొత్తం ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు అయింది . కేసీఆర్ కు జరిగిన పరీక్షలలో అంట నార్మల్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్ర వ్యాపితంగా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని దేవాలయాలు , చర్చులలో ,మజీదులలో ప్రార్ధనలు జరుగుతున్నాయి .

తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముుఖులు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్‌కు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడం తో ప్రజలలో ఆందోళన నెలకొన్నది .కేసీఆర్ తో పాటు కేటీఆర్ విశ్రాంతి లో ఉండటంతో పాలనపై ప్రభావం ఉంటుందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.
తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ వేదికగా ప్రకటించారు. తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని డాక్టర్ల సలహా మేరకు ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నానని పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఫ్యామిలీ
ఇప్పటి వరకు ముగ్గురు కరోనా బారినపడ్డారు.మొదట సీఎం కేసీఆర్ ఆ తర్వాత రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ఇప్పుడు కేటీఆర్‌కు కరోన సోకింది.త్వరలోనే వారు కోలుకోవాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.
తెలంగాణాలో సైతం కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుంది ,పల్లెలు పట్టణాలు వణికి పోతున్నాయి. దీంతో ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నది . ఇందులో భాగంగానే రాత్రి పూట కర్ఫ్యూ విధించింది . అయితే కొన్ని చోట్ల జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పై విమర్శలు ఉన్నాయి. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా , తిరుపతిలోని మనం ఎన్నికల అనంతరం కరోనా ఉదృతిని చూశాం .అందువల్ల వాయిదా వేస్తె బాగుండు అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

Related posts

నాసిక్‌లోని ఆసుప‌త్రిలో ఘోర ప్ర‌మాదం.. ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ లీక్‌.. 22 మంది మృతి

Drukpadam

కోవిడ్‌పై శ్వేతపత్రం విడుదల చేసిన రాహుల్ గాంధీ!!

Drukpadam

బ్రిటన్ లో కరోనా ఆంక్షలు పూర్తిగా తొలగింపు?

Drukpadam

Leave a Comment