Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలురాజకీయ వార్తలు

కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం ఎక్కడో గాడి తప్పింది: అనుపమ్‌ ఖేర్‌

కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం ఎక్కడో గాడి తప్పింది: అనుపమ్‌ ఖేర్‌
ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలకు సమర్థింపు
ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలని హితవు
తేలుతున్న శవాలపై రాజకీయాలొద్దని కాంగ్రెస్‌కు చురక
ఎన్‌డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు
ప్రధాని మోదీ, కేంద్రం ప్రభుత్వంపై నిత్యం ప్రశంసలు కురిపించే ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ అనూహ్యంగా ఈసారి విమర్శలు ఎక్కుపెట్టారు. కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం ఎక్కడో గాడి తప్పిందన్నారు. మహమ్మారిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలను ఆయన సమర్థించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రజలు అప్పగించిన బాధ్యతను చక్కబెట్టాలని హితవు పలికారు. ఇప్పటి వరకు జరిగిన నష్టానికి ప్రభుత్వానిదే బాధ్యత అని ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్‌డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీకి కూడా అనుపమ్‌ ఖేర్‌ పరోక్షంగా చురకలంటించారు. శవాలు నీటిలో తేలడం చూసి మానవత్వం లేని వారు మాత్రమే చలించరని వ్యాఖ్యానించారు. పరోక్షంగా బిహార్‌లో గంగా నదిలో కొట్టుకొచ్చిన శవాలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి అంశాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకోకూడదని సూచించారు. ప్రస్తుతం అనుపమ్‌ ఖేర్‌ భార్య కిరణ్‌ ఖేర్‌ బీజేపీ ఎంపీగా ఉండడం గమనార్హం. ఇదే అంశంపై పలువురు స్పందించారు.కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని రాజకీయపార్టీలు ప్రధానికి కి లేఖ రాశాయి.కాంగ్రెస్ నాయకత్వంలో విడుదలైన ఈ లేఖపై 12 పార్టీలు సంతకాలు చేశాయి. ఇప్పటికే విదేశీ మీడియా మోడీ విధానాలను దుమ్మెత్తి పోసింది. కరోనా సెకండ్ వేవ్ ను గుర్తిచటంలో గుర్తించిన దాన్ని కట్టడి చేయటంలో అలసత్వం ప్రదర్శించారని ఇంట బయట మోడీపై విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. సెకండ్ వేవ్ సందర్భంగా ఎన్నికలు జరపటం వాటికీ ప్రధాని , హోమ్ మంత్రి స్వయంగా వెళ్లడం పెద్ద పెద్ద సభల్లో పాల్గొనటం , రోడ్ షోలలో పాల్గొనడంపై పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. ఆక్సిజన్ లేక అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కరోనా కు అత్యంత ప్రాణప్రదంగా భావిస్తున్న రెమిడీసివెర్ ఇంజక్షన్ లభించక పోవటం , ఒకవేళ బ్లాక్ మార్కెట్ లో లభించినప్పటికీ దాని ధర 30 వేల నుంచి 40 వేల వరకు పలికింది. ఇక వ్యాక్సిన్ వచ్చినప్పటికీ ధరల విషయంలో రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య ,కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వ్యత్యాసం ఉండటం , ప్రవైట్ వాళ్లకు ఒక రేటు ప్రభుత్వానికి ఒకరేటు నిర్ణయించడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ఎన్నికలు జరుగుతున్నా రాష్ట్రాలలో వ్యాక్సినేషన్ పై వాగ్దానాలు ఇవ్వడం విమర్శలకు దారి తీసింది. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్ ను మనకు కాకుండా ఇతర దేశాలకు పంపించటంపై కూడా అభ్యంతరాలు ఉన్నాయి. విదేశాలకు 7 కోట్ల డోసులు పంపిన భారత ప్రభుత్వం , మన దేశంలో మాత్రం 4 కోట్లని వినియోగించింది.ఉతపట్టి కంపెనీ లకు అడ్వాన్సులు ఇచ్చి వారిని పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసేలా ఎందుకు చర్యలు తీసుకోలేదని శాత బయోటెక్ మేనేజింగ్ డైరక్టర్ వరప్రసాద్ రెడ్డి అన్నారు. దేశ జనాభా 138 కోట్లు  మనకు కావలిసిన వ్యాక్సిన్ సుమారు 300 కోట్ల డోసులు , మన దగ్గర ఉత్పత్తి చేసే కంపెనీ లు నెలకు 15 నుంచి 20 కోట్ల వ్యాక్సిన్ లు మాత్రమే తయారు చేసే సామర్థ్యము ఉంది. అంటే అందరికి వ్యాక్సిన్ అందాలంటే సంవత్సరం ఆగాల్సిందే . ఇది అత్యంత లోప భూయిష్ఠ విధానం . పిచ్చోడు ,మూర్ఖుడు అనుకున్న ట్రాంప్ ముందుగానే అక్కడ కంపెనీలకు అడ్వాన్సులు ఇచ్చి కావాల్సిన తమ జనాభా 30 కోట్లు అయితే 65 కోట్ల వ్యాక్సిన్లకు ఆర్డర్ లు ఇచ్చారు. ఇప్పుడు ఆదేశంలో దాదాపు 65 శాతం పైగా రెండు డోసుల వ్యాక్సినేషన్ వేయటం అయిపొయింది. మాస్క్ అక్కడ ఇప్పడు కంపల్సరీ కాదు . కేవలం గుంపులు ఉన్నదగ్గరే మాస్క్ పెట్టుకోవాలని ఉంది. అనేక దేశాలు ముందుగానే ఆర్డర్ లు ఇచ్చాయి. మనం మాత్రం మనదగ్గర తయారైన వ్యాక్సిన్ విదేశాలకు పంపించి మన ప్రజలకు వ్యాక్సిన్ అందకుండా చేశాం చరిత్ర మనలను క్షమించదని వరప్రసాద్ రెడ్డి ఘాటుగానే స్పందించారు.

Related posts

రాహుల్‌గాంధీ ఏమనుకుంటున్నారు.. మనోళ్లపైనా సాయుధ బలగాలను ప్రయోగించమంటారా?: బీజేపీ సూటి ప్రశ్న

Ram Narayana

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటు చట్ట విరుద్ధం: ఢిల్లీలోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం!

Drukpadam

ఆనందయ్య మందుపై కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థకు నివేదిక!

Drukpadam

Leave a Comment