Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

భారత్ లో అందరికి వ్యాక్సిన్ త్వరగా అందాలంటే ఉత్పత్తి సామర్థ్యం పెరగాలి

భారత్ లో అందరికి వ్యాక్సిన్ త్వరగా అందాలంటే ఉత్పత్తి సామర్థ్యం పెరగాలి
రానున్న 4 నెలల్లో భారీగా పెరగనున్న దేశీయ టీకా సంస్థల తయారీ సామర్థ్యం
దేశంలో ఆందోళన కలిగిస్తున్న టీకాల కొరత
ఆగస్టు నాటికి భారీగా పెంచుతామని సంస్థల హామీ
భారత్‌ బయోటెక్ 7.82 కోట్లు, సీరం 10 కోట్ల డోసులకు పెంపు
ఎట్టిపరిస్థితుల్లో హామీని నిలబెట్టుకుంటామని భరోసా
138 కోట్ల జనాభా గల భారత్ లో కరోనా టీకా అందరికి అందాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందేనా అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఉత్పత్తి సామర్థ్యం పెరగాలి లేకపోతె ఇతర దేశాలనుంచి వ్యాక్సిన్ దిగుమతి జరగాలి . లేదా దేశంలో కరోనా వ్యాక్సిన్ తయారు చేసే సంస్థలు రెండే ఉన్నాయి. వాటి బాగా చేయగలిగితే నెలకు 17 కోట్ల ఉత్పత్తి సామర్థ్యం . అదికూడా సామర్థ్యం పెంచుకుంటే పొతే . అంటే మరో నాలుగు నెలలలో 17 కోట్లకు చేరుకుంటుంది. అంటే ఇలాగానే కొనసాగితే త్వరగా ఇవ్వలేమనే ఆందోళన వ్యక్తం అవుతుంది. అందువల్ల దాని వేగం పెంచాలి, సామర్థ్యం పెరగాలి .ఇతర సంస్థలకు తయారీని అప్పగించాలి. అనే ప్రతిపాదనలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా టీకా కొరత ఆందోళన కలిగిస్తున్న తరుణంలో దేశీయ వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు కీలక విషయాన్ని వెల్లడించాయి. రానున్న నాలుగు నెలల్లో తమ ఉత్పత్తికి సంబంధించిన సమాచారాన్ని కేంద్రానికి తెలిపాయి. తమ తయారీ సామర్థ్యాన్ని రానున్న రోజుల్లో గణనీయంగా పెంచనున్నామని పేర్కొన్నాయి. ఆగస్టు నాటికి ఉత్పత్తిని 10 కోట్ల డోసులకు పెంచుతామని సీరం, 7.8 కోట్లకు పెంచుతామని భారత్‌ బయోటెక్‌ తెలిపాయి. కేంద్రం ఆదేశాల మేరకు ఆయా సంస్థలు తమ ప్లాన్‌ను కేంద్రానికి అందించాయి.

భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌ తయారీని జులై నాటికి 3.32 కోట్ల డోసులకు, ఆగస్టు నాటికి 7.82 కోట్ల డోసులకు, సెప్టెంబరులోనూ ఇదే స్థాయిలో పెంచుతామని సంస్థ ప్రతినిధి డాక్టర్‌ వి.కృష్ణ మోహన్‌ తెలిపారు. ఇక మరో సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆగస్టు నాటికి తమ తయారీ సామర్థ్యాన్ని 10 కోట్ల డోసులకు పెంచుతామని.. సెప్టెంబరులో అదే స్థాయి కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

వ్యాక్సిన్‌ తయారీ సామర్థ్యాన్ని పెంచడానికి ఉన్న అన్ని వనరుల్ని వినియోగించుకుంటామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ తెలిపింది. ఎట్టిపరిస్థితుల్లో తామిచ్చిన హామీని నెరవేర్చి తీరతామని భరోసానిచ్చింది.
అయితే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే ఫార్మాలను ఇతర తయారీ సంస్థలకు ఇస్తే ఉత్పత్తి పెరిగి తొందరగా వ్యాక్సిన్ అందించే అవకాశం ఉంటుందని చెబుతున్నాయి. ఇది ప్రత్యేక పరిస్థితులలో కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయమని అందువల్ల కేంద్రం వెంటనే దీనిపై స్పందించాలని కోరుతున్నాయి.

Related posts

కరోనా వైరస్ పై అమెరికా ,చైనా పరస్పర ఆరోపణలు మీ దగ్గర అంటే మీదగ్గరే పుట్టింది…

Drukpadam

వార్తలలో వ్యక్తి కృష్ణపట్నం ఆనందయ్య …..

Drukpadam

తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగింపు దిశగా అడుగులు …?

Drukpadam

Leave a Comment