Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎన్నికల ఖర్చులో టాప్ లో ఉన్న టీఎంసీ…

ఎన్నికల ఖర్చులో టాప్ లో ఉన్న టీఎంసీ…
-వామ్మో ! బెంగాల్ ఎన్నిలకల్లో టీఎంసీ చేసిన ఖర్చు 158 కోట్లు
-ఎన్నికల వ్యయాలను వెల్లడించిన ఈసీ
-రూ.114.14 కోట్లతో రెండో స్థానంలో డీఎంకే
-కాంగ్రెస్ ఐదు రాష్ట్రాల్లో చేసిన ఖర్చు కంటే టీఎంసీ చేసిన ఖర్చు రెండింతలు
-ఇప్పటి వరకు ఎన్నికల వ్యయం వెల్లడించని బీజేపీ

ఎన్నికల్లో ఖర్చులు ఆయా రాజకీయపార్టీలు ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సి ఉంది. ఎన్నికల సంఘానికి ఇచ్చే లెక్కలే అరకొరగా ఉంటాయనే విమర్శలు ఉన్నాయి. అయినప్పటికీ ఏవో కొన్ని పార్టీలు నిజాయతీగా లెక్కలు చెబుతున్నప్పటికీ జాతీయపార్టీల లెక్కలు మాత్రం విచిత్రంగా ఉంటాయి . దేశంలో వివిధ రాష్ట్రాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి వాటి వివరాలు పార్టీలు అందజేశాయి. వాటి ప్రకారం ఒక్క బెంగాల్ లో పోటీచేసిన టీఎంసీ చేసిన ఖర్చు కంటే జాతీయ పార్టీలు ఐదు రాష్ట్రాలలో చేసిన ఖర్చు 50 శాతం తక్కువగా ఉండటం గమనార్హం .

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఏకంగా రూ. 154.28 కోట్లు ఖర్చు చేసింది. ఆయా శాసనసభలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయా పార్టీలు చేసిన ఖర్చుల వివరాలను ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో ఉంచింది. దీని ప్రకారం.. తృణమూల్ కాంగ్రెస్ తర్వాత అత్యధికంగా ఖర్చు చేసిన పార్టీల్లో తమిళనాడులోని డీఎంకే ఉంది. ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలో వచ్చిన డీఎంకే రూ. 114.14 కోట్లు ఖర్చు చేసింది. అయితే, ఇందులో పుదుచ్చేరి ఖర్చులు కూడా కలిపే ఉన్నాయి. ఇక అన్నాడీఎంకే తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల్లో కలిపి రూ. 57.33 కోట్లు ఖర్చు చేసింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో కలిపి కాంగ్రెస్ పార్టీ మొత్తం రూ. 84.93 కోట్లు ఖర్చు చేయగా, ఈ ఐదు రాష్ట్రాల్లో సీపీఐ మొత్తంగా రూ. 13.19 కోట్లు ఖర్చు చేసినట్టు ఎన్నికల సంఘ వెల్లడించిన వివరాల ప్రకారం తెలుస్తోంది. ఎన్నికల వ్యయానికి సంబంధించి బీజేపీ వివరాలను వెల్లడించాల్సి ఉంది. కాగా, కాంగ్రెస్ పార్టీ ఐదు రాష్ట్రాల్లో చేసిన ఖర్చు కంటే టీఎంసీ ఒక్క పశ్చిమ బెంగాల్‌లో చేసిన ఖర్చు రెండింతలు కావడం గమనార్హం.

Related posts

టీఆర్ యస్ ను పల్లెత్తు మాట అనని అమిత్ షా ..నిర్మల్ సభలో చప్పగా సాగిన ప్రసంగం!

Drukpadam

టీఆర్ యస్ లో జిల్లాల అధ్యక్షులని నియమించారు …కానీ కమిటీలను మరిచారు…

Drukpadam

ఖమ్మం వస్తున్నకేటీఆర్ కు మా ఇంట్లో భోజనం ఏర్పాట్లు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి!

Drukpadam

Leave a Comment