తెలంగాణ రాజకీయ వార్తలు ..

శ్రీధర్ బాబును కలిసిన పలువురు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు…

  • మంత్రిని కలిసిన వారిలో సుధీర్ రెడ్డి, వివేకానంద గౌడ్, అరికెపూడి గాంధీ
  • ఇంకా కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి కూడా…
  • జీహెచ్ఎంసీకి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి

తెలంగాణ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబును శనివారం సాయంత్రం ఆరుగురు ఎమ్మెల్యేలు కలిశారు. మంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, వివేకానంద గౌడ్, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు ఉన్నారు.

తమ తమ నియోజకవర్గాలలో అభివృద్ధి పనులకు సహకరించాలని మంత్రిని ఎమ్మెల్యేలు కోరారు. అభివృద్ధి పనుల ప్రతిపాదనలను మంత్రికి అందించారు. అలాగే, జీహెచ్ఎంసీకి నిధులు విడుదల చేయాలని వారు శ్రీధర్ బాబును కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జీహెచ్ఎంసీకి నిధులు విడుదల చేయలేదని వారు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

Related posts

సీఎం అభ్యర్థిత్వంపై నిర్ణయం పూర్తికాలేదు… వేచి చూస్తున్నాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Ram Narayana

లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగడంపై ఈటల రాజేందర్ క్లారిటీ

Ram Narayana

అప్పులు, ఖర్చుల లెక్కలపై కేటీఆర్‌కు భట్టివిక్రమార్క సమాధానం…!

Ram Narayana