Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

20 స్థానాలు పెరిగితే రాజకీయ ముఖ చిత్రం మారేది…

20 పార్లమెంటు స్థానాలు విపక్షాలకు పెరిగితే దేశ రాజకీయ ముఖ చిత్రంలో స్పష్టమైన -మార్పు వచ్చేదని బిజెపి పాలన నుంచి దేశానికి విముక్తి లభించేదని ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహయం -రఘురాంరెడ్డి తెలిపారు. పార్లమెంటులో మెజార్టీ తగ్గినా బిజెపిలో మార్పు లేదని ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. పార్లమెంటు సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఖమ్మంకు వచ్చిన -రఘురాంరెడ్డి శనివారం ఖమ్మం సిపిఐ కార్యాలయంకు వెళ్లారు. సిపిఐ శ్రేణులు ఎంపికి ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అధ్యక్షతన జరిగిన అభినందన సభలో రఘురాంరెడ్డి -మాట్లాడుతూ ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వడం లేదని అధికార పక్షానికి సమయ పరిమితే లేదన్నారు. స్పీకర్, రాష్ట్రపతి కూడా బిజెపి నేతల్లాగానే వ్యవహరిస్తున్నారని రాష్ట్రపతి ఉపన్యాసం బిజెపి నేతల ఉపన్యాసాన్ని తలపించిందని ఆయన తెలిపారు. 40 ఏళ్ల నాటి ఎమర్జెన్సీని ఎత్తి చూపడం ద్వారా బిజెపి ఏమి సాధించాలనుకుంటుందో అర్థం కావడం లేదన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో బిజెపి విఫలమైందని అందుకే పార్లమెంటులో రాజ్యాంగాన్ని రక్షించండి అంటూ రాజ్యాంగ పుస్తకాన్ని ఎత్తి చూపి నినదించానని రఘురాంరెడ్డి తెలిపారు. మోడీ విధానాల పట్ల బిజెపి మిత్రపక్షాల్లోను అంత సానుకూలత లేదన్నారు. అగ్నివీస్తో భారత సైన్యం బలహీనపడుతుందని ఈ విషయాన్ని సైనిక బలగాల ఉన్నతాధికారులు చెప్పినా మోడీ వినే స్థితిలో లేరన్నారు.. పార్లమెంటు భవనం కార్పొరేట్ ఆఫీసును తలపిస్తుందని గతంలో ఉన్న భవనం హుందాగా ఉందన్నారు. సిపిఐ -సహకారం మరువలేనిదని అన్ని వేళల సిపిఐని కలుపుకు పోతూ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తానని -రఘురాంరెడ్డి హామీ ఇచ్చారు. ఖమ్మంజిల్లా అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించానని ఇప్పటికే విమానాశ్రయం

గురించి మాట్లాడానని బడ్జెట్ సమావేశాల్లో సింగరేణి సమస్యను లెవనెత్తుతానని ఆయన తెలిపారు. పాలేరులో టూరిజం హబ్, ఖమ్మంలో యూనివర్సిటీ స్థాపనకు కృషి చేస్తానన్నారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ -సభ్యులు బాగం హేమంతరావు మాట్లాడుతూ రఘురాంరెడ్డి విజయంలో కమ్యూనిస్టు శ్రేణులు తమ వంతు పాత్రను నిర్వర్తించారన్నారు. పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన తర్వాత కమ్యూనిస్టు పార్టీ ఆఫీసుకు వచ్చి కృతజ్ఞతలు తెలపడం ఒక మంచి పరిణామమని దీనిని సిపిఐ స్వాగతిస్తుందన్నారు. ఎంపి రఘురాంరెడ్డికి అన్ని విధాలా దన్నుగా నిలబడతామని హేమంతరావు తెలిపారు. గత ఎన్నికలు బిజెపికి ఒక గుణపాఠమని మతోన్మాద శక్తులు భవిష్యత్తులో దెబ్బతినక తప్పదని హేమంతరావు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు మహ్మద్ మౌలానా, దండి సురేష్ ప్రసంగించగా జమ్ముల జితేందర్రెడ్డి, యర్రాబాబు, సిద్దినేని కర్ణకుమార్, కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్ పాల్గొన్నారు . అనంతరం ఎంపి రఘురాంరెడ్డిని ఘనంగా సన్మానించారు.

Related posts

కొత్తగూడెంలో వనమా గెలుపు కోసం ఎంపీ వద్దిరాజు బుల్లెట్ పై హల్చల్

Ram Narayana

నాగెలుపులో ప్రధానపాత్ర వహించి 50 వేల మెజార్టీ ఇచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు శాల్యూట్ ..! మంత్రి తుమ్మల

Ram Narayana

ప్రొఫెసర్ గాలి అరుణకుమార్ హఠాన్మరణం….

Ram Narayana

Leave a Comment