Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కేటీఆర్ వాహనానికి ట్రాఫిక్ చలనా…ఆ పోలీసులను అభినందించిన కేటీఆర్

తన వాహనానికి ట్రాఫిక్ చలాన్ వేసిన ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్ల ను అభినందించిన మంత్రి శ్రీ కేటీఆర్

తన వాహనానికి విధించిన చలాన్ ను చెల్లించిన మంత్రి శ్రీ కేటీఆర్

నిబంధనలు ప్రజల కైనా ప్రజాప్రతినిధులకైనా ఒకటే అన్న మంత్రి శ్రీ కేటీఆర్

నిజాయితీగా నిబంధనల ప్రకారం పని చేసే ఐలయ్య లాంటి అధికారులకు తామెప్పుడూ అండగా ఉంటామన్న కేటీఆర్

రెండు రోజుల కింద తన వాహనానికి ట్రాఫిక్ చలాన్ విధించిన ట్రాఫిక్ ఎస్ఐ ఐలయ్య ను మంత్రి కే. తారకరామారావు అభినందించారు. రాంగ్ రూట్ లో వచ్చిన మంత్రి వాహనానికి సైతం నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ట్రాఫిక్ సిబ్బందిని తన కార్యాలయానికి పిలిపించుకుని మరి అభినందనలు తెలిపారు. సామాన్య ప్రజలు అయినా అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులైనా….నిబంధనలు అందరికీ ఒకటే అని, ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో తాను ఎల్లవేళల ముందు ఉంటానని, చలాన్ విధించిన రోజు సైతం వాహనంలో తాను లేనని కేటీఆర్ అన్నారు. అయితే బాపు ఘాట్ లో నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమం సందర్భంగా అనుకోని పరిస్థితుల్లో రాంగ్ రూట్ లో వచ్చిన తన వాహనానికి నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ఎస్ ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్ లకు శాలువా కప్పి అభినందించిన మంత్రి, విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించే ఐలయ్య లాంటి అధికారులకి ఎప్పుడూ తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు.

మంత్రి కేటీఆర్ తన వాహనానికి విధించిన చలాన్ ను సైతం చెల్లించారు. ఈ విషయంలో తమ పార్టీ కార్యకర్తలు నాయకులకు సరైన సందేశం అందెందుకే ఈరోజు ట్రాఫిక్ సిబ్బందిని అభినందించిన విషయాన్ని, పార్టీ శ్రేణులు గుర్తించాలని కేటీఆర్ అన్నారు

Related posts

Microsoft Details Updates To The Bing Maps Web Control

Drukpadam

మార్నింగ్ వాక్‌ చేస్తున్న అసోం డీఐజీ ఫోన్ చోరీ!

Ram Narayana

జర్నలిస్టుల సమస్యలపై వ్య .కా రాష్ట్ర సభల్లో తీర్మానం చేసినందుకు ధన్యవాదాలు .. .టి యూ డబ్ల్యూ జే (ఐజేయూ )

Drukpadam

Leave a Comment