Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

చిన్న ఎన్నిక పెద్ద గుణపాఠం …”మా” ఎన్నికలపై ఒక విశ్లేషణ ….

చిన్న ఎన్నిక పెద్ద గుణపాఠం …”మాఎన్నికలపై ఒక విశ్లేషణ ….
రెండు వర్గాలుగా విడిపోయిన సినీ దిగ్గజాలు
వందల ఓట్లుపెద్ద ఎత్తున జరిగిన ప్రచారం
కులాలు , సామజిక సమీకరణాలు
విందులు ,వినోదాలుప్రలోభాలు
సాధారణ ఎన్నికల ను తలపించిన దూషణలు
ఒక్క పదవికోసం ఇంత లోకువకావడం అవసరమా అన్న చిరంజీవి
మనం సమాజం లో పలచనై పోయామన్న చిరు
విష్ణు ఎన్నికైన వెంటనేమాకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన నాగబాబు
మా లో ఎన్నికలు అనేవి జరగకూడదన్న మోహన్ బాబు

మూవీ ఆర్టిస్ట్ అసోసిషన్ కు నిన్న జరిగిన ఎన్నికలు చాల చిన్నవే…. ‘మా’లో మొత్తం 925 మంది సభ్యులు ఉండగా, వారిలో ఓటు హక్కు ఉన్నది 883 మందికి.నిన్న జరిగిన పోలింగ్ లో పోస్టల్ బ్యాలెట్లతో సహా కేవలం 665 ఓట్లు పోలయ్యాయి. కానీ అవి పెద్ద గుణపాఠాన్ని నేర్పాయి…. ఇగోలకు పోవద్దని సాధ్యమైనంత సామరస్యంగా ఏకగ్రీవ ఎన్నికలు జరిపితే అందరికి బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి….. కులాలు కుంపట్లు …. సామాజిక వర్గాలుగా విడిపోవడం , వ్యక్తిగత దూషణలు, అహంకారపూరితంగా వ్యవహరించడం ఇందులో కనిపించాయి. ప్రకాష్ రాజ్ మంచి నటుడే అయినప్పటికీ ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ,దేవుడంటే ఆయనకు భక్తి లేదని , కమ్యూనిస్ట్ భావాలూ కలిగినవాడని అలంటి వ్యక్తిని పోటీకి నిలపడం అవివేకమైన చర్యనే అభిప్రాయాలు బలంగా వినిపించాయి. వ్యక్తి గత విమర్శలు మోతాదుని మించాయి. నాకు తెలుగు బాగా వస్తుందని , నాకు వచ్చినంత తెలుగు ఎవరికీ రాదని , పవన్ కళ్యాణ్ ఫస్ట్  షో అంత   విష్ణు సినిమా బడ్జెట్ ఉండదని అనడం , సినీ పరిశ్రమలో పెద్దలపై అనుచిత వ్యాఖ్యలు ప్రకాష్ రాజ్ పట్ల ఉన్న సదభిప్రాయం లేకుండా చేశాయి.    ప్రత్యర్థులు కూడా దాన్నే బాగా ఉపయోగించుకున్నారు. పోస్టల్ బ్యాలట్ ఓట్లలో అన్యాయం జరిగిందని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. క్రాస్ ఓటింగ్ జరిగి అధ్యక్ష అభ్యర్థుల ఓట్లలో భారీ తేడా వచ్చింది. ప్రకాష్ రాజ్ పై విష్ణు 100 కుపైగా ఓట్లతో గెలుపొందారు .

 

సినీ పెద్దలు అనుకుంటే ఏకగ్రీవంగా జరగాల్సిన ఎన్నిక … అసలు దీనికి ఎన్నిక అవసరమా ? విందు రాజకీయాలు , ప్రలోభాలు ,ఓట్ల కొనుగోళ్లు లాంటి సాధారణ ఎన్నికల అవలక్షణాలు చోటు చేసుకోవడం మంచిదేనా? ఇది దేనికి సంకేతం …భవిషత్ లో మా సభ్యులు కలిసి ఉంటారా ? కొట్టు కుంటారా ? అసలు తెలుగు సినీ చిత్రపరిశ్రమ ఐక్యంగా ఉంటుందా ? అనే అభిప్రాయాలు అందరి మనసులను తొలుస్తున్నాయి. ఎన్నికలు అయిపోయాయి ఇక తెలుగు సినీ పరిశ్రమ, ఇగోల నుంచి కుల రాజకీయాల నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నారు. . అందుకు చిరంజీవి ,మోహన్ బాబు లు పూనుకోవాల్సిందే … మీ ఇగోలను , పక్కన పెట్టండి తెలుగు సినీ చిత్రపరిశ్రమలో సుహృద్బావ వాతావరణం నెలకొల్పేందుకు పూనుకోవాలి . మా అధ్యక్షుడు ఎవరైనా చిరంజీవి ,మోహన్ బాబు ల వైపే అందరు చూస్తున్నారు. అందుకు వారు ఏమి చేస్తారు .ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే ఆశక్తి నెలకొన్నది .

 

వందల సంఖ్యలో సభ్యులు ఉన్న “మా” ఎన్నికల ప్రచారం పై ప్రచార మాధ్యమాలు ఫోకస్ పెట్టడం కూడా ఒక కారణం అనే అభి ప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎంటర్టైన్మెంట్ ఇస్తూ సెలబ్రిటీలుగా ఉన్న వారు ఏది చేసిన వార్తే కదా ! అందువల్ల “మా” ఎన్నికలు ప్రజల దృష్టిని బాగా ఆకర్షించాయి.

రెండు ప్యానళ్లు హోరా హోరి తలపడ్డాయి. చివరకు ఓట్ల లెక్కిపు సందర్భంగా సైతం నరాలు తెగే ఉత్కంఠ నెలకొన్నది . ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు పోటీ కాకుండా , ఒకపక్క మోహన్ బాబు మరో పక్క చిరంజీవి పోటీ పడుతున్నారా ? అన్నంతగా వార్ నడిచింది. పైకి ఎన్ని చెప్పినప్పటికీ ఇది తెలుగు సినీ రంగంలో ఆధిపత్య పోరులాగా కనిపించింది. రాజకీయ వర్గాలతో పాటు మిగతా వర్గాల్లో ఈ ఎన్నికపై ఆశక్తి కనిపించింది. రిక్షాపుల్లర్ దగ్గర నుంచి ఆటో వాళ్ళు , క్యాబ్ డ్రైవర్లు , విద్యార్థులు , యువతలోనూ ,చివరకు మహిళల్లోనూ ఒక్కరేమిటి అన్ని వయసుల వారిలో దీనిపై చర్చోపచర్చలు బెట్టింగులు జరిగాయి. ఎవరు గెలిచారు ? మోహన్ బాబు నా ? చిరంజీవిని అని ఆరా తీయడం జరిగింది.

నిజానికి మోహన్ బాబు కంటే చిరంజీవికి ప్రజల్లో మంచి పలుకుబడి తో పాటు క్రేజ్ ఉన్నాయి. ఆయన మాటంటే అందరికి చిత్రపరిశ్రమలో అందరికి గౌరవం ఉన్నాయి. కానీ తమ్ముళ్లతోనే వచ్చింది అసలు చిక్కు అనే గుసగులు బయలు దేరాయి. నాగబాబు ,పవన్ కళ్యాణ్ ల వైఖరి కొన్ని సందర్భాలలో చిరంజీవి కి చిక్కులు తెస్తూ ఆయన ఇమేజ్ ని డామేజ్ చేస్తున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. నాగబాబు చేసిన విమర్శలు సద్విమర్శలుగా ఉంటె అభ్యంతరం లేదు . కానీ అవి ఇతరుల మనసులు దోచుకునేట్లు కాకుండా విరిచేట్లుగా ,అహంకారపూరితంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి . చిరంజీవి తోపాటు మొత్తం మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ ను సఫోర్ట్ చేస్తామని ప్రకటించడం మెగా ఫ్యామిలీ ఎటు చెపితే అటు చిత్రపరిశ్రమ ఉంటుందనే అభిప్రాయాలు కల్పించే విధంగా మాట్లాడటం నచ్చని అంశంగా ఉంది . వాస్తవంగా చిరంజీవి బయటకు చెప్పకపోయినా ఆయన ఏ ప్యానల్ కు సఫోర్ట్ చేస్తే ఆ ప్యానల్ విజయం సాధిస్తుందనే అభిప్రాయాలు ప్రజల్లో బలంగా ఉండేవి . కానీ నిన్న జరిగిన ఎన్నికల్లో అది జరగలేదు . మెగా ఫ్యామిలీ బలపరిచిన ప్రకాష్ రాజ్ ప్యానల్ ఘోరంగా ఓడిపోయింది. ఇది ప్రకాష్ రాజ్ ఓటమి కాదు …మెగా ఫ్యామిలీ ఓటమి అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చిన్న పదవి కోసం ఇంత లోకువ అవసరమా ? అని చిరంజీవి అంటున్నారు. మరి నాగబాబు ను ఎందుకు రంగంలోకి దించినట్లు ? అనే దానికి చిరంజీవి నుంచి వివరణ ఆశిస్తున్నారు. అందరిని కూర్చో బెట్టి మాట్లాడి ఏకాభిప్రాయం తో మా ఎన్నికలు జరిగేట్లు ఎందుకు చేయలేదు . దీనికి ఎవరు అభ్యంతరం పెట్టారు. మోహన్ బాబు పెట్టారా ? ఒకవేళ ఆయన అభ్యంతరం పెడితే అది ఆయన తప్పు అవుతుంది. ఇందుకు ఎవరు కారణం అనేది కూడా లోతుగా ఆలోచించాలని చిరంజీవి అన్నారు . దానికి హోమియో చికిత్స అవసరం అని కూడా అంటున్నారు. మరో ఆడో ఎప్పటిలోగా చేస్తారోనని ఆశక్తి నెలకొన్నది .

Related posts

కమల్ హాసన్ పై నమ్మకం మాములుగా లేదు …!

Ram Narayana

చిక్కుల్లో నటి ప్రియమణి వైవాహిక జీవితం…

Drukpadam

లుథియానా కోర్టులో పేలుడు కేసు…అనుమానితుడి గుర్తింపు!

Drukpadam

Leave a Comment