Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

దెయ్యాన్ని గుర్తించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్!

దెయ్యాన్ని గుర్తించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్!
గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
గ్రామానికి అసలు సమస్య గుడుంబానే అని నిర్ధారించిన ఎమ్మెల్యే
దెయ్యం భయంతో గ్రామం ఖాళీ…
పాటిమీదిగూడెం గ్రామంలో దెయ్యం భయం
కొన్నిరోజుల వ్యవధిలో 8 మంది మరణం
దెయ్యం తిరుగుతోందని చెప్పిన భూతవైద్యుడు
ఒకరోజు పాటు ఊరు ఖాళీ చేయాలని సూచన

మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన నియోజకవర్గంలో ఒక గ్రామంలో దెయ్యం ఉందని వదంతులు వచ్చాయి. దీంతో భూతవైద్యుడి సలహామేరకు భయంతో ప్రజలు గ్రామాన్నిఒక రోజు ఖాళీ చేశారు. ఈ విషయం ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు చేరింది. ఆయన గూడూరు మండలంలోని పాటిమీద గూడెం గ్రామంలో పర్యటించారు. అక్కడ ప్రజలను విచారించారు. ప్రజల నుంచి తీసుకున్న సమాచారంతో అక్కడ దయ్యం అనేది ఏమి లేదని కొందరు కావాలనే దయ్యం పుకార్లు పుట్టిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇక్కడ దయ్యం లేదు ఏమిలేదు…అంట ఉత్తిదే అసలు దయ్యం గుడంబానే అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అంతకుముందు గ్రామంలో జరిగిన మరణాలపై కూడా విచారణ జరపాలని అధికారాలను ఎమ్మెల్యే కోరారు. వారు దాదాపు అందరు అధికంగా గుడంబా తాగటం వల్లనే చనిపోయినట్లు నిర్దారణకు వచ్చారు.వివిరాల్లోకి వెళితే ….

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పాటిమీదిగూడెంలో కొన్నిరోజులుగా దెయ్యం భయం నెలకొంది. కొంతకాలంగా ఊర్లో పలు కారణాలతో 8 మంది మరణించారు. కొద్ది వ్యవధిలోనే ఇంతమంది చనిపోవడంతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇదే అదనుగా ఓ భూతవైద్యుడు రంగప్రవేశం చేసి గ్రామంలో దెయ్యం తిరుగుతోందని, ఒకరోజంతా ఊరిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్పాడు. దాంతో ప్రజలు ఒకరోజు పాటు గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు.

ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ చెవినపడడంతో ఆయన ఆశ్చర్యపోయారు. వెంటనే పాటిమీదిగూడెం గ్రామంలో స్వయంగా పర్యటించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను గుర్తించారు. అనంతరం మాట్లాడుతూ, ఇక్కడ గుడుంబానే అసలు దెయ్యం అని స్పష్టం చేశారు. గుడుంబా తాగడం మానేస్తే అన్ని పరిస్థితులు చక్కబడతాయని హితవు పలికారు.

Related posts

ఏళ్ల పాటు సెలవు పెట్టకుండా ఉద్యోగం..90 ఏళ్లకు రిటైర్మెంట్!

Drukpadam

తిరుమల నడకమార్గంలో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం

Ram Narayana

కళకళలాడుతున్న అమెరికా విమానాశ్రయాలు.. లక్షలాదిమందితో కిటకిట

Drukpadam

Leave a Comment