Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీడీపీ సెల్ఫ్ గోల్ చేసుకుందా ?

టీడీపీ సెల్ఫ్ గోల్ చేసుకుందా ?
చంద్రబాబు వ్యూహం బెడిసి కొట్టిందా ?
పట్టాభి పంచులు తిరగబడ్డాయా?
మంట కలిసిన రాజకీయ విలువలుప్రజాస్వామ్యం అపహాస్యం
ఏపీ లో పగలు ,ప్రతీకారాలు

టీడీపీ సెల్ఫ్ గోల్ చేసుకుందా ? చంద్రబాబు వ్యూహం బెడిసి కొట్టిందా ? పట్టాభి పంచులు తిరగబడ్డాయా ? ఏపీ లో జరుగుతున్న రాజకీయపరిణామాలు ఎటు వైపు దారితీయనున్నాయి . . రాజకీయ విలువలను మంటగలిపి ,ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారా ? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులువైసీపీ ,టీడీపీ లమధ్య జరుగుతున్న యుద్ధంలో అసలు తప్పెవరిది అనేది ఆశక్తిగా మారింది.టీడీపీ ,వైసీపీలు ఒకరిని మించి మరొకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఇద్దరివైపు తప్పుంది అనే వారు కొందరైతే లేదు వైసీపీ దే తప్పు ,మరి కొందరు లేదు లేదు టీడీపీ దే తప్పు అని భట్టిప్రోలు తీర్పునిచ్చేవారు ఉన్నారు. మంత్రి కొడాలి నాని తిట్టడంలేదా ? అంటూ సీఎం పై పట్టాభి చేసిన వ్యాఖ్యలు పూర్వపక్షం చేయాలనీ చూసేవారు ఉన్నారు.వాటిలోని అర్థలకు రకరకాల భాష్యాలు చెపుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ బోసిడికేఅంటే మీరు బావున్నారా అనే అర్థాన్ని చెప్పారు.

ఎదో చేద్దాం అనికొని ఎదో చేసినట్లుఏపీ లో టీడీపీ చేసిన తప్పిదాలు పత్యేర్థులకు వరంలా మారుతున్నాయి. రెండు రోజుల క్రితం టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని నోటికొచ్చినట్లు తిట్టాడు ,బోసిడికే అంటూ సంబోధించారు.అది మీడియా సమావేశంలో పదేపదే దాన్నే ఉచ్చరించాడు .అది తమకు మైలేజ్ వస్తుందని టీడీపీ భావించి ఉండవచ్చు కానీ అది టీడీపీ మెడకే చుట్టుకుంది . దీనివల్ల టీడీపీ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లైంది .దీనికి తోడు అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష , ప్రతిగా వైసీపీ ప్రజాగ్రహ దీక్షలు ఏపీ రాజాకీలను కుదిపేస్తున్నాయి.

రాజకీయాల్లో విలువలు మంట కలిశాయి….అబద్దాల పునాదులపై , అవినీతి కట్టడాలపై రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. ఈర్ష ,ద్యేషం, పగలు ,ప్రతీకారాలు , కులం , మతం , ప్రాంతం ,అనే విభజన రేఖలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు రాజకీయనాయకులు . ఏపీ లో జగన్ నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి అడుగడుగునా ఆటంకాలు , కోర్టులలో లిటిగేషన్ పిటిషన్ లు , ప్రజలు ఛీ కొట్టినా కనీస ఆత్మవిమర్శ లేకుండా వ్యవహరించడంఎన్నికల్లో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతున్న అవి తమను కాదన్నట్లు వ్యవహరించడం దిగజారుతున్న రాజకీయ విలువలకు పరాకాష్ట …..

సమర్థించుకోవటానికైనా కొంత సిగ్గు బిడియం ఉండాలిఏపీ లో అవి మచ్చుకైనా కనిపించక పోవడం దారుణం . జరుగుతున్న రాజకీయపరిణామాలు అత్యంత జుగుస్సాకరంగా ఉన్నాయి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి తిట్టిన తిట్లు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయి. ఆతరువాత జరిగిన పరిణామాలు కూడా మంచివి కావు . పైగా 40 సంవత్సరాల రాజకీయజీవితం , 14 సంవత్సరాలు సీఎం చేసి దేశంలోనే సీనియర్ రాజకీయనాయకుడిగా గుర్తింపు పొందిన చంద్రబాబు నాయుడు నడుపుతున్న తెలుగుదేశం పార్టీ కొన్ని విలువలకు కట్టుబడి ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి. కానీ పట్టాభి మాటలతో అవి గంగలో కలిసి పోయాయి. పట్టాభి తొందర పడ్డారు . ఆలా అని ఉండాల్సింది కాదని సీనియర్ నేత చంద్రబాబు అని ఉంటె టీడీపీకి మైలేజ్ వచ్చిఉండేది. చంద్రబాబు విలువ పెరిగేది. అది జరక్క పోగా టీడీపీ ఆఫీసులపై దాడులు జరిగాయని ఏపీ లో ప్రజాస్వామ్యం మంట కలిసి పోయిందని , వెంటనే ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేయడం నిజంగా చంద్రబాబుకే చెల్లింది. చంద్రబాబు రాజకీయాల్లో విలువలు పాటిస్తారనే అభిప్రాయాలు నిజంకాదని పౌరాణికి సినిమాల్లో అన్నట్లు కపట నాటక సూత్రధారి ఎవరో కాదు చంద్రబాబే అని వైసీపీ ఆరోపణలు నిజమేనని అనిపించేలా ఆయన చర్యలు ఉన్నాయి. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ముఖ్యమంత్రి పై నిలువెల్లా విషం నింపుకున్న చంద్రబాబు విషాన్ని తన అనుంగ శిష్యులకు అంటించారు. ఆలాంటి శిష్యులలో ఒకరే కొమ్మారెడ్డి పట్టాభి . పట్టాభి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పూనకం వచ్చినవాడిలా ఊగిపోయాడు. ముఖ్యమంత్రి జగన్ ను పట్టుకొని ఒరే బోసిడికే అంటూ సంబోధించడం పదాన్ని పదేపదే ఉచ్చరించడం , అంతే కాకుండా తాడేపల్లి కార్యాలయం పాలేరు గాడు అంటూ సంబోధించడం చూస్తుంటే అవి యాదృచ్చికంగా వచ్చిన మాటలు కావని అర్థం అవుతుంది .

ప్రభుత్వం మీద విమర్శలు చేయడంలో తప్పులేదు. విధానపరమైన విమర్శలు ఉండాలి . చేస్తున్న విమర్శలు ప్రత్యర్థులను సైతం కదిలించేవిగా ఉండాలి ఆలా కాకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం ఒక ముఖ్యమంత్రిని పట్టుకొనిబోసిడికేఅంటూ తిట్ల దండకం తో పూనకం వచ్చిన వాడిలా ఊగి పోవడం దాన్ని చంద్రబాబు సమర్థించడం పతనం అవుతున్న రాజకీయ విలువలకు అద్దం పడుతున్నాయి. తన కొడుకు వయసున్న వైయస్ జగన్ ముఖ్యమంత్రి అవడం చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారు. గత రెండున్నరేళ్లుగా ఆయన పాలనకు కావలసినన్ని ఆటంకాలు కల్పించారు. అయినప్పటికీ సీఎం జగన్ చాల ఓర్పుతో తాను తలపెట్టిన కార్యక్రమాలు ముందుకు తీసుకోని పోతున్నారు. జగన్ ఓర్పు తో ఉండటం టీడీపీకి ఇష్టం లేదు. అందువల్ల ఆయన్ను రెచ్చగొట్టడం ద్వారా దిగజారుతున్న తమ ఉనికిని కాపాడు కోవచ్చుననే దుష్టతలంపుతో జగన్ పై వ్యక్తిగత దూషణలకు టీడీపీ పాల్పడుతుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Related posts

కేసీఆర్ తో మాట్లాడలేదు.. మిగతా పార్టీల నాయకులంతా వస్తున్నారు: తేజస్వి యాదవ్…

Drukpadam

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు సీపీఎం మద్దతు: తమ్మినేని వీరభద్రం!

Drukpadam

కేసీఆర్ ను ఏమైనా అంటే చుక్కలు చూపిద్దాం: కేటీఆర్

Drukpadam

Leave a Comment