అంతర్జాతీయం

అమెరికాలో జనాలపైకి దూసుకెళ్లిన వాహనం… 10 మంది మృతి

  • నూతన సంవత్సరాది వేళ అమెరికాలో ఘటన
  • ఓ వ్యక్తి పికప్ ట్రక్కును ప్రజలపైకి నడిపిన వైనం
  • ట్రక్కు నుంచి దూకేసి కాల్పులు జరిపిన వ్యక్తి

నూతన సంవత్సరాది వేళ అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వాహనం జనాలపైకి దూసుకెళ్లిన ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 30 మంది గాయపడ్డారు. న్యూ ఆర్లియన్స్ లోని ఫ్రెంచ్ క్వార్టర్ బౌర్బన్ స్ట్రీట్ లో ఈ ఘటన జరిగింది. నగర మేయర్ ఈ ఘటనను ఉగ్ర దాడిగా పేర్కొన్నారు. 

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం… ఓ వ్యక్తి పికప్ ట్రక్కును వేగంగా నడుపుకుంటూ వచ్చి ఒక్కసారిగా కిందికి దూకేశాడు. ఆ ట్రక్కు ప్రజలపైకి దూసుకెళ్లింది. ట్రక్కు నుంచి దూకిన వ్యక్తి కాల్పులు ప్రారంభించాడు. అక్కడున్న పోలీసులు కూడా వెంటనే కాల్పులు జరిపారు. న్యూ ఆర్లియన్స్ లోని ఫ్రెంచ్ క్వార్టర్ ప్రఖ్యాత పర్యాటక స్థలంగా పేరుగాంచింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా.. జపాన్‌, దక్షిణ కొరియాలో హై అలెర్ట్…

Ram Narayana

అమ్మకానికి అమెరికా సిటిజన్ షిప్ …రూ.44 కోట్లిస్తే గోల్డ్ కార్డ్ కు రెడ్ కార్పెట్ … ట్రంప్

Ram Narayana

అమెరికాలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ నే దోచుకున్న దొంగ!

Ram Narayana