క్రైమ్ వార్తలు

నార్సింగిలో… వైన్ షాపులో దొంగతనానికి వచ్చి తాగి నిద్రపోయాడు!

  • ఆదివారం రాత్రి వైన్ షాపులో దూరిన దొంగ
  • మద్యం బాటిళ్లు చూసి ఆగలేక ఫుల్లుగా తాగేసిన వైనం
  • మరుసటి రోజు ఉదయం దుకాణదారు కంటపడిన దొంగ

హైదరాబాద్ శివారు ప్రాంతం నార్సింగిలో ఆసక్తికర ఘటన జరిగింది. వైన్ షాపులో చోరీకి వచ్చిన ఓ దొంగ మద్యం తాగి అక్కడే పడిపోయి, చివరికి కటకటాల్లోకి చేరాడు. 

మెదక్ జిల్లా నార్సింగిలో కనకదుర్గ వైన్ షాపు యజమాని పర్షా గౌడ్ ఆదివారం రాత్రి దుకాణం మూసేసి ఇంటికి వెళ్లాడు. ఓ దొంగ షాపు పైకప్పుకు ఉన్న రేకులను తొలగించి లోపలికి చొరబడ్డాడు. అక్కడున్న డబ్బును తనతో తెచ్చుకున్న బ్యాగులో సర్దుకున్నాడు. అక్కడున్న మందు బాటిళ్లను కూడా బ్యాగులో పెట్టుకున్నాడు. 

షాపులో ఉన్న మందుబాటిళ్లను చూసి ఆగలేకపోయిన ఆ దొంగ… ఫుల్లుగా తాగేసి అక్కడే పడిపోయాడు. మరుసటిరోజు ఉదయం షాపు ఓనరు వచ్చి దుకాణం తెరిచి చూడగా… ఓ వ్యక్తి నేలపై పడిపోయిన స్థితిలో కనిపించాడు. వెంటనే ఆయన నార్సింగి పోలీసులకు సమాచారం అందించాడు. 

పోలీసులు వచ్చి ఆ దొంగను తట్టి లేపారు. ఎదురుగా పోలీసులు కనిపించే సరికి ఆ దొంగ దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఆ దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు… మొదట ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని ఆ దొంగను అరెస్ట్ చేశారు.

Related posts

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రసాద్ పై కేసు నమోదు చేసిన పోలీసులు…

Ram Narayana

ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్ శరీరంపై 500కుపైగా గాయాలు

Ram Narayana

నగల దుకాణంలో పట్టపగలే దోపిడీ..!

Ram Narayana