Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాపు సామాజిక వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి: చింతా మోహన్!

కాపు సామాజిక వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి: చింతా మోహన్!
-వైసీపీ నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు
-రాష్ట్ర మంత్రులు బూతులు మాట్లాడుతున్నారు
-దేశాన్ని అమ్మేందుకే మోదీ పని చేస్తున్నారు

కేంద్ర మాజీమంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింత మోహన్ ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు.ఆంధ్రప్రదేశ్ కు కాపు సామాజికవర్గ వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని అన్నారు. కులం ప్రస్తావన ఎందుకు తెచ్చారనేది చర్చనీయాంశంగా మారింది. రాష్టం బ్రష్టు పట్టిపోయిందని రాష్ట్ర మంత్రులు బూతులు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. దేశాన్ని అమ్మెందుకే మోడీ పనిచేస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.కాంగ్రెస్ ఏమి చేస్తుంది అనేది ఆయన చెప్పలేదు. పైగా రాష్ట్రాన్ని విడగొట్టి ఏపీ కి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు ఇంకా నమ్మే పరిస్థిలో లేరు. కాంగ్రెస్ ను తిరిగి గాడిలో పెట్టాలని రాహుల్ ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ ఇక్కడ నాయకులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నారు అప్పుడప్పుడు చింత మోహన్ లాంటివారు స్పందిస్తున్న వారి స్పందన పార్టీ కి మేలు చేసేవిధంగా ఉండటం లేదనే అభిప్రాయాలే ఉన్నాయి.

రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని వైసీపీ నేతలపై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ మండిపడ్డారు. సభ్యత, సంస్కారం లేకుండా రాష్ట్ర మంత్రులు బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

మోదీ పాలనలో దేశ పరిస్థితి దిగజారిందని చింతా మోహన్ విమర్శించారు. సరిహద్దుల్లో చైనా రెచ్చిపోతున్నా మౌనంగా ఉంటున్నారని దుయ్యబట్టారు. ఎన్ని వేల కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందో కేంద్ర ప్రభుత్వం వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.

100 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేశామంటూ మోదీ గొప్పలు చెప్పుకుంటున్నారని… కాంగ్రెస్ హయాంలో ఎన్నో విలువైన వ్యాక్సిన్లను వేసినప్పటికీ ఎప్పుడూ గొప్పగా చెప్పుకోలేదని అన్నారు. ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తికి చెందిన పోర్టులో పెద్ద ఎత్తున హెరాయిన్ దొరికినా చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. భారత్ ను అమ్మేసేందుకు మోదీ పని చేస్తున్నారని విమర్శించారు. దేశంలోని యువతకు ఉద్యోగాలు దొరక్కపోయినా డ్రగ్స్ మాత్రం దొరుకుతున్నాయని అన్నారు.

Related posts

పని చేయకుండా దగ్గరకొచ్చి కబుర్లు చెప్పే వారిని ఉపేక్షించను: చంద్రబాబు హెచ్చరిక!

Drukpadam

అసెంబ్లీ అభ్యర్థులపై బీఆర్ యస్ లీకులు …కరీంనగర్ లోకసభకు అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్ …

Drukpadam

రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి జగదీశ్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి!

Drukpadam

Leave a Comment