Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

లాలూ ఆగాయా …బీహార్ రాజకీయాలు మారనున్నాయా!

లాలూ ఆగాయా …బీహార్ రాజకీయాలు మారనున్నాయా!

లాలూ తిరిగి వచ్చారు. బీహార్ రాజకీయాలు మారనున్నాయా ? అనే చర్చ జరగుతుంది .

నేనొచ్చేశా.. కాంగ్రెస్ , బీజేపీలకు లాలూ మెసేజ్ ఇదే
అరెస్టులు, అనారోగ్య కారణాలతో ఇన్నాళ్లూ దూరం
ప్రజల ప్రేమ, అభిమానంతోనే రాగలిగా
ప్రధాని అభ్యర్థిగా నితీశ్ కుమార్

లాలూ ప్రసాద్ యాదవ్ అత్యంత ప్రతిభావంతమైన నాయకుడిగా పేరున్నవాడు … దాణా కేసులో జైలుకెళ్లిన లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవలనే జైలు నుంచి బయటకు వచ్చారు . బీహార్ ముఖ్యమంత్రిగా చాలాకాలం పనిచేసిన లాలూ బీహార్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.

హాస్యభరితమైన ప్రసంగాలతో చతురోక్తులతో ఆకట్టుకునేవారు ….తిరిగి రాజకీయాల్లో ఆక్టివ్ కావాలనే కుతూహలంతో ఉన్నారు .నేరుగా తాను పదవులు తీసుకోకపోయినా తన తనయుడి రాజకీయ భవిషత్ కోసం ఆయన రంగ ప్రవేశం చేయనున్నారు.

ప్రజల ప్రేమ, ఆదరాభిమానాలతోనే తాను తిరిగి రాగలిగానని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. అరెస్టులు, అనారోగ్య కారణాలతో గత రెండు ఎలక్షన్లకు దూరమయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉప ఎన్నికల తరుణంలో తాను రాగలిగానని, అందుకు ప్రజల ప్రేమే కారణమని ఆయన వ్యాఖ్యానించారు.

నితీశ్ కుమార్ పై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారని, అది త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీకి తెలిసి వస్తుందని అన్నారు. ప్రధాని అంటే నితీశ్ కుమార్ లాగా ఉండాలన్న నినాదాలు వినిపిస్తున్నాయని, ప్రధాని అభ్యర్థిగా ఆయన్ను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

ఉప ఎన్నికలు జరుగుతున్న కుశేశ్వర్, తారాపూర్ లో రేపు బహిరంగ సభ నిర్వహిస్తానని లాలూ తెలిపారు. కాంగ్రెస్ తో పొత్తుపై స్పందించిన ఆయన.. ఒకేరకమైన ఆలోచనలున్న లౌకికవాద పార్టీలతోనే పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నామని గుర్తు చేశారు.

చాలా సంవత్సరాల తరువాత లాలూ పత్రికలకు వెక్కటంతో రాజకీయాల్లో ఆశక్తికర చర్చ జరుగుతుంది. బీహార్ లో మంచి పట్టు ఉన్న లాలూ ఎలాంటి వ్యూహరచన చేయనున్నారో చుడాలిసిందే !

Related posts

వైయస్సార్ కుటుంబంపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Drukpadam

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఉక్కిరిబిక్కిరి పలువురు నేతలు టీఎంసీ వైపు చూపు…

Drukpadam

శ‌ర‌ద్ ప‌వార్ ఇంటిపై దాడి… రాళ్లు, చెప్పులు విసిరేసిన ఎంఎస్ఆర్టీసీ కార్మికులు!

Drukpadam

Leave a Comment