Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

కరోనా వ్యాక్సిన్ తీసుకోకుంటే తెలంగాణాలో నో రేషన్ , నో పెన్షన్ “సర్కార్ నిర్ణయం!

కరోనా వ్యాక్సిన్​ తీసుకోకుంటే రేషన్​, పెన్షన్​ బంద్​.. తెలంగాణ సర్కార్​ కీలక నిర్ణయం

  • నవంబర్ 1 నుంచే అమలు
  • వెల్లడించిన హెల్త్ డైరెక్టర్
  • డిసెంబర్ నాటికి వంద శాతం వ్యాక్సినేషన్ జరగాలన్న హైకోర్టు
  • ఇప్పటిదాకా 2.13 కోట్ల మందికి టీకాలు
  • అందులో 86 లక్షల మందికే రెండో డోసు

కరోనా టీకాల విషయంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అందాలంటే కరోనా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే అని షరతు విధించింది. ఒకవేళ వ్యాక్సిన్ తీసుకోకపోతే నో రేషన్ …నో పెన్షన్ అని ప్రకటించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కేవలం 2 కోట్ల 13 లక్షల మంది మాత్రమే టీకాలు తీసుకోగా అందులో రెండు డోసులు తీసుకొన్న వారు కేవలం 86  లక్షల మంది మాత్రమే ఉండటంపై వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. తెలంగాణాలో 4 కోట్ల మందికి పైగా జనాభా ఉన్నారు. అందులో చిన్న పిల్లలను తీసివేస్తే మూడు కోట్లమందికి పైగా వ్యాక్సిన్ వేయాల్సిఉంది.

 

కరోనా వ్యాక్సినేషన్ పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వారిపట్ల కఠినంగా వ్యవహరించనుంది. వ్యాక్సిన్ వేసుకోని వారికి రేషన్, పెన్షన్ ను బంద్ చేస్తామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. కొత్త నిబంధనలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన చెప్పారు. డిసెంబర్ చివరి నాటికి వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.

ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదని, గతంలోనే దీనిపై చర్చ జరిగిందని తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే 80 శాతం మంది పెద్దలు మొదటి డోసు వేసుకున్నా.. రెండో డోసు విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. రెండు డోసులు వేసుకుంటేనే ప్రతిరక్షకాలు పూర్తి స్థాయిలో ఉత్పత్తి అవుతున్నాయని అధ్యయనాలు చెబుతున్న నేపథ్యంలోనే వేగంగా వ్యాక్సినేషన్ ను పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలో 2.77 కోట్ల మంది పెద్దవారుండగా.. అందులో ఇప్పటికే 2.13 కోట్ల మందికి టీకాలు వేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. అందులో కేవలం 86 లక్షల మందే రెండో డోసు తీసుకున్నారు. రెండో డోసు గడువు ముగిసినా 36 లక్షల మంది ఇంకా రెండో డోసు తీసుకోలేదు.

Related posts

భారత్ లో సింగిల్ డోస్ కరోనా టీకాలు… రేసులో జాన్సెన్, స్పుత్నిక్ లు…

Drukpadam

ఏపీ సీఎం జగన్ జార్ఖండ్ సీఎం సొరేన్ కు సుద్దులు చెప్పటంపై అభ్యతరం

Drukpadam

ఒమిక్రాన్ దెబ్బకు 11,500 విమానాల రద్దు!

Drukpadam

Leave a Comment